News September 22, 2025

H1B వీసాల ప్రభావం.. ఐటీ షేర్లు ఢమాల్

image

H1B వీసాల ఫీజు పెంపు ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. సెన్సెక్స్ 300 పాయింట్లు కోల్పోయి 82,363 వద్ద, నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయి 25,264 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా H1B వీసాల ప్రభావంతో టెక్ మహీంద్రా, TCS, ఇన్ఫోసిస్, HCL టెక్ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, అదానీ పోర్ట్స్, ఎటర్నల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Similar News

News September 22, 2025

ఏ చర్మానికి ఏ ఫేస్‌వాష్ వాడాలో తెలుసా?

image

ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఫేస్‌వాష్‌లు ఉన్నాయి. వీటిల్లో మీ చర్మానికి సరిపోయేదాన్ని ఎంచుకోవడం ముఖ్యం అంటున్నారు నిపుణులు. హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, నియాసినమైడ్ ఉన్న ఫేస్‌వాష్‌లు చర్మానికి తేమను అందించి పొడిదనాన్ని తగ్గిస్తాయి. ఆయిలీ స్కిన్ ఉన్నవారు సాలిసిలిక్ యాసిడ్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిగిన ఫేస్‌వాష్, డ్రై స్కిన్ ఉన్నవారు ఆల్మండ్ ఆయిల్, ఆలీవ్ ఆయిల్ ఉన్న ఫేస్‌వాష్ ఉపయోగిస్తే మంచిది.

News September 22, 2025

ముఖానికి ఫేస్‌వాష్ ఎందుకు వాడాలంటే?

image

కాలుష్యం, సూర్యరశ్మి, మేకప్ ప్రభావం ముఖంపై పడుతుంది. కాబట్టి రోజుకు రెండుసార్లు ఫేస్‌వాష్ చేసుకోవడం ముఖ్యమని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. అయితే చాలామంది ఫేస్‌వాష్ చెయ్యడానికి సబ్బునే వాడతారు. వాటిలో ఉండే రసాయనాల వల్ల ముఖంపై ఉండే pH దెబ్బతింటుదంటున్నారు నిపుణులు. ఫేస్‌వాష్‌లు చర్మాన్ని మృదువుగా, లోతుగా క్లీన్ చేస్తాయి. ఫేస్‌వాష్ ద్వారా pH బ్యాలెన్స్ సరిగ్గా మెయింటైన్ అవుతుందంటున్నారు నిపుణులు.

News September 22, 2025

రాష్ట్రంపై సైకోల కళ్లు పడకూడదని వేడుకున్నా: మంత్రి అనిత

image

AP: రాష్ట్రంపై సైకోల కళ్లు పడకూడదని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మను వేడుకున్నట్లు హోంమంత్రి అనిత వివరించారు. బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. పాలనలో చంద్రబాబు, పవన్, లోకేశ్‌కు శక్తి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వం 20ఏళ్ల పాటు ఉండాలని వేడుకున్నానన్నారు. దుర్గమ్మ దయ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.