News July 19, 2024
భారత్‌లో 10 బ్యాంకులపై ప్రభావం: RBI

సాంకేతిక సమస్యతో మైక్రోసాఫ్ట్ సేవలు స్తంభించిపోవడంతో దేశంలో 10 బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలపై ప్రభావం పడిందని RBI వెల్లడించింది. అయితే అది స్వల్ప అంతరాయమేనని స్పష్టం చేసింది. కొన్ని బ్యాంకులు మాత్రమే క్రౌడ్ స్ట్రయిక్‌ను వినియోగిస్తున్నాయని వివరించింది. కాగా క్రౌడ్ స్ట్రయిక్‌లో లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలు గంటల కొద్ది నిలిచిపోయిన విషయం తెలిసిందే.
Similar News
News December 16, 2025
‘యూరియా యాప్’.. ఎలా పని చేస్తుందంటే?

TG: <<18574856>>యూరియా బుకింగ్ యాప్‌ను<<>> ప్రభుత్వం ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తేనుంది. ఫోన్ నంబర్, OTPతో లాగిన్ అయి ఎన్ని బస్తాల యూరియా అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చు. యూరియా బుక్ చేయగానే ఓ ఐడీ వస్తుంది. ఏ డీలర్ నుంచైనా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ సమయంలో సాగు విస్తీర్ణం, పంట రకం వంటి వివరాలు ఇవ్వాలి. వాటి ఆధారంగా అవసరమైన యూరియాను 15 రోజుల వ్యవధితో 1-4 దశల్లో అందజేసేలా ఏర్పాటు చేశారు.
News December 16, 2025
ఎలుకల నియంత్రణకు ఇనుప తీగల ఉచ్చు

ఎలుకల నివారణకు ఈ పద్ధతి చక్కగా ఉపయోగపడుతుంది. ఇనుప తీగలు, వెదురు, తాటాకులతో తయారు చేసిన బుట్టలను ఎకరానికి 20 వరకు ఏర్పాటు చేయాలి. ఎలుకలను ఆకర్షించడానికి వాటిలో ఉల్లిపాయలు, టమాట, ఎండుచేపలు, బజ్జీలు లాంటివి ఉంచాలి. వీటిని పొలం గట్ల వెంబడి, గోదాముల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. వరిలో నారుమడి పోసిన దగ్గర నుంచి దమ్ములు పూర్తై నాట్లు వేసిన నెల వరకు.. కోతల తర్వాత ఏర్పాటు చేస్తే ఎలుకలను సమర్థంగా నివారించవచ్చు.
News December 16, 2025
కొత్త కానిస్టేబుళ్లతో నేడు సీఎం సమావేశం

AP: కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ సాయంత్రం నియామక పత్రాలు అందించనున్నారు. మంగళగిరి APSP ఆరోబెటాలియన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో CM CBN పాల్గొననున్నారు. అభ్యర్థులతో సమావేశమై కాసేపు ముచ్చటిస్తారు. ఈ నెల 22 నుంచి 9 నెలల పాటు వారికి ట్రైనింగ్ ఉంటుంది. 2022 NOVలో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. అన్ని టెస్టులను దాటుకుని 5,757 మంది ట్రైనింగ్‌కు ఎంపిక అయ్యారు.


