News August 25, 2025

OT డ్యూటీలతో ఆరోగ్యంపై ప్రభావం: సర్వే

image

ఉద్యోగుల్లో ఓవర్ టైమ్(OT) వర్క్ చేయడంపై వ్యతిరేకత ఉందని జీనియస్ HR టెక్ సర్వేలో తేలింది. అదనపు ప్రయోజనాలు లేకుండా వర్కింగ్ అవర్స్‌ను పొడిగించడాన్ని మెజార్టీ ఉద్యోగులు వ్యతిరేకించినట్లు పేర్కొంది. ఓవర్ టైమ్ డ్యూటీలతో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని 44% మంది ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపింది. తగిన బెనిఫిట్స్ ఉంటే OT చేసేందుకు ఇబ్బందేమీ లేదని 40శాతం చెప్పినట్లు వెల్లడించింది.

Similar News

News August 25, 2025

పట్టుదలతోనే పురోగతి: గోయెంకా

image

లక్ష్యసాధనలో ఉన్నవారిని ప్రోత్సహించేలా వ్యాపారవేత్త హర్ష గోయెంకా చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ఓ పని మొదలు పెట్టినప్పుడు అది వెంటనే సక్సెస్ అవ్వకపోవచ్చు. మళ్లీ ప్రయత్నించండి. ఒకటి రెండు సార్లు ప్రయత్నించినా రాకపోతే మీ పద్ధతిని మార్చుకోండి. ఇదొక నిరంతర ప్రక్రియ. సమస్య ఉంటే సాయం కోరండి. ఎవరూ చేయకపోతే మీ అనుభవంతో నేర్చుకోండి. పట్టుదలతోనే పురోగతి సాధ్యం. వదిలేయడమే ఓటమికి ఏకైక మార్గం’ అని రాసుకొచ్చారు.

News August 25, 2025

వచ్చే నెల 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబ్స్!

image

పండగ డిమాండ్ నేపథ్యంలో వచ్చే నెల 22 నుంచి GST కొత్త శ్లాబ్స్ అమలు కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 3,4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. GSTని సరళీకరిస్తూ అన్ని వస్తువులపై ట్యాక్స్‌ను రెండు శ్లాబ్స్‌‌(5%, 18%)కు పరిమితం చేయాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే. మీటింగ్‌లో చర్చించి వీటిపై కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. అయితే లగ్జరీ వస్తువులకు మాత్రం 40% GST ఉండనుంది.

News August 25, 2025

జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారు: అమిత్ షా

image

CM, PM, మంత్రులను తొలగించే బిల్లును విపక్షాలు వ్యతిరేకించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లు జైలుకెళితే అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తున్నారు. జైలునే సీఎం, పీఎం నివాసంగా మార్చుకుని ఆర్డర్స్ పాస్ చేస్తారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుంది. కాంగ్రెస్‌, ఇతర పార్టీల్లోనూ చాలామంది నైతిక విలువలు కలిగిన నాయకులున్నారు’ అని స్పష్టం చేశారు.