News March 25, 2025
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అవసరం లేదనిపించింది: ధోనీ

IPLలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ రూల్‌ను ప్రకటించినప్పుడు అవసరం లేదని అనిపించింది. టోర్నీ మంచి పొజిషన్లోనే ఉంది. TRP కూడా బాగుంది. అలాంటప్పుడు ఇంకా మసాలా యాడ్ చేయడమెందుకు అని అనుకున్నా. ప్రస్తుతం ఈ రూల్ నాకు హెల్ప్ అవ్వదు. ఎందుకంటే నేను బ్యాటింగ్, కీపింగ్ రెండూ చేస్తున్నా. టోర్నీలో హైస్కోర్లు నమోదవడానికి పిచ్ పరిస్థితులే కారణం. ఈ రూల్ కాదు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
నల్గొండ: పంచాయతీ ఎన్నికల్లో ఇంటి పోరు!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఇంటిపోరు తలనొప్పిగా మారింది.పలు గ్రామాల్లో ఒక్కో పార్టీ నుంచి ఇద్దరి నుంచి ముగ్గురిపైనే సర్పంచ్ స్థానాలకు పోటీ పడుతున్నారు. పెద్దఎత్తున నామినేషన్లు రావడంతో కొందరు విత్ డ్రా చేసుకున్నప్పటికీ మరికొందరు నేతలు విరమించేందుకు యత్నాలు చేసినా పట్టించుకోవడం లేదు. చాలాచోట్ల ఒకే పార్టీకి చెందిన అభ్యర్థులు రంగంలోకి దిగారు.
News December 5, 2025
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 5, 2025
నటుడు క్యారీ-హిరోయుకి తగావా కన్నుమూత

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా(75) కన్నుమూశారు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జపాన్‌లో జన్మించిన ఆయన అమెరికన్, రష్యన్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు. మోర్టల్ కోంబాట్, ది లాస్ట్ ఎంపరర్, లైసెన్స్ టు కిల్, ది మ్యాన్ ఇన్ ది హై కాజిల్, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి సినిమాలు, సిరీస్‌లతో పాపులర్ అయ్యారు. విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు.


