News November 25, 2024

MHలో బిహార్ ఫార్ములా అమలు చేయండి: శివసేన

image

మ‌హారాష్ట్ర‌లో బిహార్ ఫార్ములా అమ‌లు చేసి ఏక్‌నాథ్ శిండేను CMగా కొన‌సాగించాల‌ని శివ‌సేన కోరుతోంది. బిహార్‌లో RJDతో JDU విడిపోయిన‌ప్పుడు నితీశ్ కుమార్‌ను CMగా BJP కొన‌సాగించింది. 2020 బిహార్‌ ఎన్నికల్లో BJP 74 సీట్లు సాధించింది. JDUకి 43 సీట్లే దక్కినా అనంతర పరిణామాల్లో నితీశ్‌ను CMగా కొన‌సాగించింది. అదే మాదిరి MHలో BJP 132 స్థానాల్లో గెలిచినా శిండేకే CMగా అవకాశమివ్వాలని శివ‌సేన కోరుతోంది.

Similar News

News October 20, 2025

DLS కంటే VJD మెథడ్ చాలా బెటర్: గవాస్కర్

image

IND, AUS మధ్య నిన్న జరిగిన తొలి వన్డేలో DLS మెథడ్‌పై దిగ్గజ క్రికెటర్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఎప్పటి నుంచో ఉన్నా DLS గురించి చాలా మందికి తెలియదు. దీనికి బదులు ఇండియన్ కనిపెట్టిన <<18056102>>VJD<<>> మెథడ్ చాలా బెటర్. ఇరు జట్లకు అనుకూలంగా ఉంటుంది. BCCI డొమెస్టిక్ క్రికెట్లో ఈ పద్ధతిని అనుసరించింది’ అని అన్నారు. కాగా నిన్న IND 26 ఓవర్లలో 136 రన్స్ చేయగా DLS ప్రకారం టార్గెట్‌ను 131కి తగ్గించడం తెలిసిందే.

News October 20, 2025

PGIMERలో ఉద్యోగాలు

image

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(PGIMER)లో 4 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఈ నెల 30 ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS/BDSతో పీహెచ్‌డీ, ఎంఎస్సీ నర్సింగ్, MD/MS, GNM, ఇంటర్, డిప్లొమా, డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://pgimer.edu.in/

News October 20, 2025

రాష్ట్రంలో తగ్గిన నూనె గింజ పంటల సాగు విస్తీర్ణం

image

AP: రాష్ట్రంలో ఈ ఏడాది నూనెగింజ పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాది 17 లక్షల ఎకరాల్లో నూనెగింజల పంటలను సాగుచేయాలనుకోగా 6.50 లక్షల ఎకరాల్లో మాత్రమే వేరుశనగతో పాటు ఇతర నూనెగింజల పంటలు సాగయ్యాయి. వరి 38.97 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. పత్తి 11 లక్షల ఎకరాల్లో, చెరకు 30 వేల ఎకరాలకే పరిమితమైంది. మొక్క జొన్న, సజ్జ, చిరుధాన్యాలు, కందులు, ఆముదం, జూట్ వంటి పంటలు లక్ష్యానికి మించి సాగయ్యాయి.