News February 7, 2025

మే, జూన్ నెలల్లో 2 పథకాల అమలు: మంత్రి కొలుసు

image

AP: తాము అధికారంలోకి వచ్చాక ఉచిత సిలిండర్లు, అన్న క్యాంటీన్లు అమలు చేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తల్లికి వందనం(విద్యార్థికి ₹15K), అన్నదాత సుఖీభవ(రైతుకు ₹20K) పథకాలను మే, జూన్ నెలల్లో అమలు చేస్తామని ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం ప్రారంభిస్తామని CM CBN సైతం వెల్లడించారు. అన్నదాత సుఖీభవను 3 విడతలుగా అందిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

Similar News

News February 7, 2025

అంతర్జాతీయ కోర్టుపై ట్రంప్ ఆంక్షలు

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై ఆంక్షలు విధించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసి కోర్టు తన అధికారాల్ని దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. తమపై, తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్‌పై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేసిందని మండిపడ్డారు. కోర్టు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబీకుల ఆస్తుల్ని ఫ్రీజ్ చేయడంతో పాటు ప్రయాణ ఆంక్షల్ని విధించారు.

News February 7, 2025

బంగ్లాదేశ్‌ నటిపై దేశద్రోహం కేసు

image

బంగ్లాలో మహ్మద్ యూనస్ మధ్యంతర సర్కారుపై విమర్శలు చేసిన నటి మెహెర్ ఆఫ్రోజ్‌పై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆమెను కస్టడీలోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. జమాల్‌పూర్‌లోని ఆమె ఇంటిపై దుండగులు దాడి చేసి నిప్పు పెట్టడం గమనార్హం. బహిష్క‌ృత నేత హసీనాకు చెందిన ఆవామీ లీగ్‌లో ఆఫ్రోజ్ తండ్రి సభ్యుడిగా ఉన్నారు. ఆమె తల్లి అదే పార్టీ తరఫున రెండుసార్లు ఎంపీగా పనిచేశారు.

News February 7, 2025

గురుకులాల్లో ప్రవేశాలు.. ముగిసిన దరఖాస్తు గడువు

image

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. 643 గురుకులాల్లో మొత్తం 51,968 సీట్లు ఉండగా, 1.67లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఐదో తరగతికే 88,824 అప్లికేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈనెల 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనుండగా, మే 15 నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసి జూన్ 12 నుంచి క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు.

error: Content is protected !!