News November 28, 2024

డిసెంబర్ 1 నుంచి మరో హామీ అమలు: టీడీపీ

image

AP: ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని కూటమి ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి అమలు చేయబోతున్నట్లు టీడీపీ ప్రకటించింది. ‘వరుసగా 2 నెలలు పింఛన్ తీసుకోకపోయినా మూడో నెల ఒకేసారి 3 నెలల పింఛన్ తీసుకోవచ్చు. జగన్ హయాంలో రద్దు చేసిన ఈ వెసులుబాటును తిరిగి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే పింఛనుదారు మరణిస్తే అతని భార్యకు మరుసటి నెల నుంచే పింఛన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు’ అని పేర్కొంది.

Similar News

News December 13, 2025

KMM: 2వ దశ ఎన్నికలు.. 2,023 బ్యాలెట్ బాక్సులు సిద్ధం.!

image

2వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 2,023 బ్యాలెట్ బాక్సులు, 1,831 పోలింగ్ అధికారులు, 2,346 మంది OPOలను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. 28 లొకేషన్స్‌లో 304 క్రిటికల్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. మొత్తం 2,51,327మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో 1,21,164మంది పురుష, 1,30,156మంది మహిళా, 7 గురు ఇతర ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్‌కు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.

News December 13, 2025

శుభ సమయం (13-12-2025) శనివారం

image

➤ తిథి: బహుళ నవమి రా.7.21 వరకు
➤ నక్షత్రం: ఉత్తర ఉ.9.33 వరకు
➤ శుభ సమయాలు: ఏమీ లేవు
➤ రాహుకాలం: ఉ.9 నుంచి 10.30 వరకు
➤ యమగండం: మ.1.30 నుంచి 3 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.6 నుంచి 7.36 వరకు
➤ వర్జ్యం: సా.6.27 నుంచి రా.8.08 వరకు
➤ అమృత ఘడియలు: సా.5.01 నుంచి 6.41 వరకు

News December 13, 2025

శుభ సమయం (13-12-2025) శనివారం

image

➤ తిథి: బహుళ నవమి రా.7.21 వరకు
➤ నక్షత్రం: ఉత్తర ఉ.9.33 వరకు
➤ శుభ సమయాలు: ఏమీ లేవు
➤ రాహుకాలం: ఉ.9 నుంచి 10.30 వరకు
➤ యమగండం: మ.1.30 నుంచి 3 వరకు
➤ దుర్ముహూర్తం: ఉ.6 నుంచి 7.36 వరకు
➤ వర్జ్యం: సా.6.27 నుంచి రా.8.08 వరకు
➤ అమృత ఘడియలు: సా.5.01 నుంచి 6.41 వరకు