News February 18, 2025
తునిలో BNS సెక్షన్ 163(2) అమలు

AP: తుని మున్సిపాలిటీ <<15498069>>పరిధిలో <<>>BNS సెక్షన్ 163(2) అమలు చేస్తూ కాకినాడ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం సభలు, సమావేశాలు, ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడటంపై నిషేధం అమలవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కర్రలు, రాళ్లు, ఆయుధాలు పట్టుకుని తిరగడంపై నిషేధం అమల్లో ఉంటుందని చెప్పారు. తదుపరి ఉత్తర్వులు అమల్లోకి వచ్చే వరకు ప్రతిరోజూ ఉ.6 నుంచి సా.6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.
Similar News
News December 11, 2025
ఉత్కంఠ.. 4 ఓట్లతో గెలిచింది

TG: హన్మకొండ(D) ఎల్కతుర్తి మండలం ఆరేపల్లిలో సర్పంచ్ ఓట్ల లెక్కింపు ఉత్కంఠకు దారి తీసింది. చివరికి పి.స్రవంతి 4 ఓట్లతో గెలిచారు. కామారెడ్డి(D) బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లిలో BRS బలపరిచిన భాగ్యమ్మ 5 ఓట్లతో గట్టెక్కారు. వరంగల్(D) వర్ధన్నపేట మండలం అంబేడ్కర్‌నగర్ 1వ వార్డులో రజనీ, రూపకు తలో 31 ఓట్లు రావడంతో డ్రా అయింది. అధికారులు ఫలితం కోసం చిట్టీలు వేయగా రూపను అదృష్టం వరించింది.
News December 11, 2025
ఆఫీస్‌కు త్వరగా వస్తోందని ఉద్యోగి తొలగింపు.. నెట్టింట చర్చ!

ఆఫీసుల్లో సమయపాలన ఎంత ముఖ్యమో తెలిపే ఘటనే ఇది. స్పెయిన్‌లో 22 ఏళ్ల యువతిని ఓ కంపెనీ పంక్చువాలిటీ లేదని తొలగించడం చర్చనీయాంశమైంది. తన షిఫ్ట్ టైమింగ్‌కు కాకుండా 40 నిమిషాలు ముందుగానే ఆమె ఆఫీసుకు వచ్చింది. వార్నింగ్ ఇచ్చినా 19సార్లు ఇలానే రావడంతో యాజమాన్యం విసుగుచెందింది. ఇలా చేయడం వల్ల మిగతా ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగిందని కంపెనీ ఆరోపిస్తోంది. దీనిపై ఆ యువతి కోర్టుకెళ్లినా ఫలితం దక్కలేదు.
News December 11, 2025
AP క్యాబినెట్ నిర్ణయాలు

*పలు సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం
*సీడ్ యాక్సెస్ రహదారి-NH16 అనుసంధాన పనులకు రూ.532కోట్లకు గ్రీన్ సిగ్నల్
*AP ప్రిజన్స్&కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుకు ఓకే
*రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు ఆమోదం
*SIPBలో తీసుకున్న నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
*కుప్పంలో పాలేరు నదిపై చెక్‌డ్యామ్‌ల నిర్వహణకు పరిపాలన అనుమతుల మంజూరుకు ఆమోదం


