News March 17, 2024

నేడు పోలీస్ యాక్ట్ 30 అమలు: ఏలూరు ఎస్పీ

image

ఏలూరు జిల్లాలో ఆదివారం ఉ.10 నుంచి 12 గంటల వరకు.. తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సా.4 గంటల వరకు గ్రూప్-1 పరీక్షలు పకడ్బందీగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 5 పరీక్ష కేంద్రాల పరిధిలో ఏవైనా సమస్యలు ఎదురైతే 100 నెంబర్‌కు కాల్ చేయాలన్నారు. 94409 04808 కు వాట్సాప్‌లో సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు.

Similar News

News March 10, 2026

అమరావతిలో కలెక్టర్ల సదస్సుకు ప.గో కలెక్టర్ నాగరాణి

image

అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మార్చి 11, 12న జరగనున్న కలెక్టర్ల సదస్సుకు జిల్లా కలెక్టర్ నాగరాణి హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ సమావేశంలో జిల్లాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ అంశాలపై విపులంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ‘స్వర్ణాంధ్ర @ 2047’ పది సూత్రాల అమలు, శాంతిభద్రతలు, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతిపై సీఎం సమీక్షించనున్నారు.

News March 10, 2026

ATM కార్డు మార్చి.. తణుకులో వృద్ధుడికి కుచ్చుటోపీ

image

ఏటీఎం కేంద్రంలో సహాయం చేస్తానని నమ్మించి ఓ వృద్ధుడిని మోసగించిన ఘటన తణుకులో కలకలం రేపింది. ఎన్‌ఎస్‌సీ బోస్‌ రోడ్డుకు చెందిన బచ్చు సుబ్బారావు సోమవారం ఎస్‌బీఐ ప్రధాన శాఖ ఏటీఎంలో నగదు తీయడానికి వెళ్లారు. అక్కడ ఉన్న గుర్తుతెలియని వ్యక్తి సహాయం నెపంతో కార్డు మార్చేసి, సుబ్బారావు ఖాతా నుంచి రూ.23,430 నగదు కాజేశాడు. నగదు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు.

News March 10, 2026

ప.గో: అదనపు కట్నం వేధింపులు.. భర్తతో సహా నలుగురిపై కేసు

image

అదనపు కట్నం తేవాలని వేధిస్తున్న భర్త, అత్త, మరిది, మరదలుపై నరసాపురం టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం.. లుటుకుర్తి రాజేశ్‌కు స్వరూపతో 2020లో వివాహమైంది. అప్పటి నుంచి రాజేశ్ అదనపు కట్నం తేవాలని, అనారోగ్యంతో ఉన్న పిల్లాడి వైద్యానికి కూడా డబ్బులు పంపకుండా, గల్ఫ్‌లో ఉంటూ భర్త వేధిస్తున్నాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్ఐ ముత్యాలరావు కేసు నమోదు చేశారు.