News July 10, 2025

త్వరలో ఆదర్శ రైతుల ద్వారా పథకాల అమలు: రైతు కమిషన్

image

TG: త్వరలో గ్రామానికి ఒక ఆదర్శ రైతును ఎంపిక చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. గ్రామాల్లో ప్రభుత్వ స్కీములను వారి ద్వారా అమలు చేస్తామన్నారు. అయితే ఆదర్శ రైతులకు వేతనాలు ఉండవని స్పష్టం చేశారు. కాగా 2007లో కాంగ్రెస్ సర్కార్ ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. గౌరవ వేతనం కింద నెలకు రూ.1,000 అందించింది. 2017లో BRS ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేసింది.

Similar News

News July 11, 2025

రష్మిక విలన్ రోల్ చేస్తోందా?

image

అల్లు అర్జున్-అట్లీ మూవీలో రష్మిక నటిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లని, అందులో రష్మిక ఒకరని సినీటౌన్‌లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే దీపికను హీరోయిన్‌గా పరిచయం చేశారు. మృణాల్ కూడా షూటింగ్‌లో పాల్గొన్నారని చెబుతున్నారు. మిగిలిన 3 పాత్రల్లో రష్మిక, జాన్వీ, భాగ్యశ్రీ పేర్లు వినిపిస్తున్నాయి. రష్మిక పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని, యాక్షన్ సీన్సూ చేస్తారని సమాచారం.

News July 11, 2025

నాకు ప్రాణ హాని ఉంది: ట్రంప్

image

ట్రంప్‌పై ఏ క్షణమైనా దాడి జరగొచ్చని ఇరాన్ సీనియర్ అధికారి <<17014894>>జావద్ లారిజనీ<<>> చేసిన హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ‘జావద్ లారిజనీ హెచ్చరికలను బెదిరింపులుగానే భావిస్తున్నాను. నా ప్రాణాలకు హాని ఉంది అనే వార్తల్లో సందేహం లేదు. నిజానికి నేను ఏడేళ్ల వయసు నుంచే సన్ బాత్ చేయడం మానేశాను’ అని వ్యాఖ్యానించారు. ఆ సమాధానం చూస్తే ఇరాన్ హెచ్చరికలను ట్రంప్ తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.

News July 11, 2025

శుభాంశు శుక్లా తిరుగు పయనం వాయిదా

image

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్, వ్యోమగామి శుభాంశు శుక్లా తిరుగు పయనం వాయిదా పడింది. <<16831702>>యాక్సియం-4<<>> మిషన్‌లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన నలుగురు సభ్యులు ఈ నెల 14న భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉందని నాసా తెలిపింది. 14 రోజుల యాత్ర కోసం జూన్ 25న ఈ మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే. కాగా ఇవాళే వారు తిరిగి రావాల్సి ఉండగా వాయిదా పడింది. స్పష్టమైన కారణాలేంటో నాసా వెల్లడించలేదు.