News March 16, 2024
దేశవ్యాప్తంగా ఇంటి నుంచి ఓటింగ్ అమలు
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఇంటి నుంచి ఓటేసే సౌకర్యం అమలుకానుంది. గతంలో పలు అసెంబ్లీ ఎన్నికల్లో పరీక్షించిన ఈ సౌకర్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తామని CEC రాజీవ్ కుమార్ ప్రకటించారు. 85 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు గలవారు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం గలవారికి ఈ అవకాశం ఇస్తామన్నారు. ఇందుకోసం ముందే రిజిస్టర్ చేసుకుంటే పోలింగ్ సిబ్బంది స్వయంగా ఇంటికి వచ్చి ఓటు నమోదు చేసుకుంటారని వెల్లడించారు.
Similar News
News November 21, 2024
BGT టెస్ట్: రేపు ఆడే జట్టు ఇదేనా?
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి పెర్త్లో తొలి టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్లో భారత తుది జట్టులో ఎవరెవరుంటారన్న ఆసక్తి క్రికెట్ వర్గాల్లో నెలకొంది. ప్రాక్టీస్ సెషన్లను బట్టి తుది జట్టును ఆస్ట్రేలియా మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. వాటి ప్రకారం.. రేపటి తుది జట్టు: జైస్వాల్, కేఎల్ రాహుల్, పడిక్కల్, కోహ్లీ, పంత్, ధ్రువ్ జురెల్, నితీశ్ , రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్
News November 21, 2024
అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?: కవిత
TG: అదానీపై అమెరికాలో కేసు నమోదవడంపై BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ‘అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్టు చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్టు చేయడం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా??’ అని ట్వీట్ చేశారు.
News November 21, 2024
భూమిని ఆక్రమిస్తే బయట తిరగలేరు: సీఎం చంద్రబాబు
AP: గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూఆక్రమణలకు పాల్పడ్డారని CM చంద్రబాబు అసెంబ్లీలో ఆరోపించారు. ఆ చట్టాన్ని రద్దు చేశాం కానీ జరిగిన అవకతవకలను ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024 పేరుతో కఠిన చట్టాన్ని తీసుకొస్తున్నాం. ఇకపై ఎవరైనా భూమిని ఆక్రమిస్తే ఆరు నెలల్లోనే శిక్ష పడేలా చేస్తాం. వాళ్లు ఇక బయట తిరగలేరు’ అని హెచ్చరించారు.