News November 13, 2024

ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన

image

AP: 16వేల పైచిలుకు పోస్టుల భర్తీ కోసం త్వరలోనే DSC నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల్లో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. గతంలో TDP అధికారంలో ఉన్నప్పుడు 11 DSCల ద్వారా 1.5 లక్షల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామని, అందులో 9 DSCలు చంద్రబాబు హయాంలోనే నిర్వహించామన్నారు. మెగా DSCపైనే తొలి సంతకం పెట్టామని, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు తొలుత టెట్ నిర్వహించామన్నారు.

Similar News

News September 16, 2025

మద్యంమత్తులో లారీ డ్రైవర్ బీభత్సం

image

MPలోని ఇండోర్‌లో ఓ లారీ డ్రైవర్ మద్యం తాగి వాహనంతో బీభత్సం సృష్టించాడు. వాహనాలనే కాకుండా రోడ్డు పక్కనే నడుస్తున్న ప్రజలను కూడా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలయ్యాయి. బైకులను ఢీకొట్టి వాటిని రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. ఓ బైకును లాక్కెళ్లడంతో దాని ట్యాంక్ పేలి లారీ మొత్తం తగలబడిపోయింది. డ్రైవర్ ఫుల్‌గా తాగేసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదైంది.

News September 16, 2025

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు మరో రోజు పొడిగింపు

image

AY 2025-26కు గానూ ITR ఫైలింగ్ గడువును ఆదాయ పన్ను శాఖ మరోసారి పెంచింది. జులై 31నే ఈ గడువు ముగియాల్సింది. దానిని SEP 15కు పొడిగించింది. ఇప్పుడు మరొక్క రోజు(సెప్టెంబర్ 16 వరకు) పెంచింది. ట్యాక్స్ ఫైలింగ్ పోర్టల్‌లో టెక్నికల్ గ్లిట్చ్ కారణంగా ఫైలింగ్‌కు చాలామంది ఇబ్బందులు పడినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే గడువును పొడిగించినట్లు తెలస్తోంది. గడువులోగా ఫైలింగ్ పూర్తి చేయాలని అధికారులు సూచించారు.

News September 16, 2025

ట్రంప్ హింట్.. అమెరికా చేతికి TikTok!

image

సెప్టెంబర్ 17కల్లా టిక్ టాక్‌ పగ్గాలు అమెరికా చేతికి రాకపోతే ఆ యాప్‌ను తమ దేశంలో బ్యాన్ చేస్తామని US ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై చైనా-అమెరికా ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘దేశంలోని యువత ఎంతగానో కోరుకుంటున్న ఓ డీల్ దాదాపుగా పూర్తైంది’ అని అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ చేశారు. త్వరలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడనున్నారు. డీల్ కోసం ఫ్రేమ్ వర్క్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.