News April 2, 2024

స్కూళ్లకు కీలక ఆదేశాలు

image

TG: ఏప్రిల్ 8వ తేదీ నుంచి స్కూళ్లలో SA-2 పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, 8వ తరగతి వారికి ఉదయం 9 నుంచి 11.45 గంటల వరకు, 9వ తరగతి వారికి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 19వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.

Similar News

News April 6, 2026

భర్తను కాదని నచ్చిన వాడితో ఉండేందుకు అనుమతించిన కోర్టు

image

పెళ్లయిన 19 ఏళ్ల మహిళ తన భర్త, తల్లిదండ్రులతో ఉండటానికి నిరాకరించిన కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 40 ఏళ్ల భర్త నుంచి విడిపోయి, తనకిష్టమైన భాగస్వామితో ఉంటానన్న ఆమె నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. మేజర్ అయిన వ్యక్తికి తన ఇష్టప్రకారం జీవించే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ ఇచ్చినా, ఫ్యామిలీ ఒత్తిడి చేసినా సదరు మహిళ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడం గమనార్హం.

News April 6, 2026

ఇవాళ లేదా రేపు అమరావతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం!

image

AP: అమరావతి చట్టబద్ధత బిల్లు కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్రపతి భవన్‌కు చేరింది. ఇవాళ లేదా రేపు ప్రెసిడెంట్ దానికి ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. న్యాయనిపుణులతో పరిశీలన అనంతరం ఆమోదం తెలపనున్నారు. దీంతో ఆ బిల్లు చట్టంగా మారనుంది. ఆ తర్వాత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

News April 6, 2026

కాంగ్రెస్‌ పాకిస్థాన్ పాట పాడుతోంది: మోదీ

image

కాంగ్రెస్ చర్యలు పాకిస్థాన్‌‌కు అనుకూలంగా ఉన్నాయని, జాతీయ భద్రతకు అది ప్రమాదమని ప్రధాని మోదీ అన్నారు. ‘ఆ పార్టీ ఎల్లప్పుడూ పాక్ పల్లవినే అందుకుంటుంది. దాన్ని మేం ఎప్పటికీ అనుమతించబోం’ అని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కాంగ్రెస్ వైఖరిని ఆయన తప్పుబట్టారు. చొరబాటుదారులను బాధితులుగా చూపాలని ఆ పార్టీ ప్రయత్నించిందని అస్సాంలోని బార్పేట సభలో ఫైరయ్యారు.