News August 9, 2024

స్కూళ్లకు కీలక ఆదేశాలు

image

AP: స్కూళ్లలో స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని స్కూళ్ల విద్యార్థులకు ఆగస్టు 15, రాజ్యాంగ విలువ, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాస రచన, క్విజ్, డిబేట్, ఆటల పోటీలు నిర్వహించాలని పంచాయతీల <<13816066>>సర్పంచ్‌లకు<<>> నిర్దేశించారు. పిల్లలకు చాక్లెట్లు అందించి పారిశుద్ధ్యంపై మహాత్మాగాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని చెప్పారు.

Similar News

News March 10, 2026

USకు జెలెన్‌స్కీ సాయం.. కాలం కలిసి రావడం అంటే ఇదే!

image

‘ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి’ అన్నట్లు జియోపాలిటిక్స్ మారిపోయాయి. ఏడాది క్రితం వైట్‌హౌస్‌లో జెలెన్‌స్కీని ఎగతాళి చేసిన ట్రంప్ ఇప్పుడు అదే ఉక్రెయిన్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇరాన్ డ్రోన్లతో అమెరికా రక్షణ వ్యవస్థలు దెబ్బతింటుంటే వాటిని కూల్చడంలో ఆరితేరిన ఉక్రెయిన్ నైపుణ్యం ఇప్పుడు USకు అవసరమైంది. మిస్సైళ్ల కోసం అర్థించిన జెలెన్‌స్కీ నేడు అమెరికాకు రక్షణ వ్యవస్థ అందించే స్థాయికి చేరారు.

News March 10, 2026

UAEలో రియల్ ఎస్టేట్ ఢమాల్.. గంటలోనే రూ.7.3 కోట్లు తగ్గిన ధర

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధంతో దుబాయ్, అబుదాబిలో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోతోంది. అబుదాబిలోని అల్-జుబైల్‌లోని ఫోర్ బెడ్ రూమ్ ఫ్లాట్ ధర ఒక గంటలోనే రూ.7.3 కోట్లు తగ్గిందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. కాగా ఇరాన్ ఇప్పటివరకు యూఏఈపై వెయ్యికి పైగా మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి చేసింది. దీంతో బిలియనీర్లు సేఫ్టీ కోసం దుబాయ్ వదిలి సింగపూర్‌కు షిఫ్ట్ అయి అక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

News March 10, 2026

క్షమాపణ కోరిన NCERT

image

8వ తరగతి పుస్తకంలో <<19253509>>‘న్యాయ వ్యవస్థలో అవినీతి’<<>> పాఠ్యాంశంపై వివాదం చెలరేగడంతో NCERT బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పింది. ఇప్పటికే ఆ పుస్తకాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. ఈ పుస్తకంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ దాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ కూడా ఆ పాఠ్యాంశంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.