News August 23, 2024
స్కూళ్లకు కీలక ఆదేశాలు

AP: ఎయిడెడ్ స్కూళ్లలో నిర్వహిస్తున్న అన్‌ఎయిడెడ్ సెక్షన్ల వివరాలు సమర్పించాలని విద్యాశాఖ ఆదేశించింది. పలు ఎయిడెడ్ స్కూళ్లు సమాంతరంగా అన్ ఎయిడెడ్ సెక్షన్లు నిర్వహిస్తున్నాయి. ఎయిడెడ్‌లో పిల్లలు తక్కువగా ఉండటంతో ఇక్కడి టీచర్లను ప్రైవేట్ సెక్షన్లకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో పిల్లల్ని అన్‌ఎయిడెడ్‌లో ఎక్కువగా చేర్చుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి.
Similar News
News March 5, 2026
సంతానోత్పత్తికోసం ‘మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’: CBN

AP: సంతాన లేమితో బాధపడుతున్న వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని CM చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. PPP మోడల్‌లో ‘మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’లు ఏర్పాటు చేసి సబ్సిడీపై IVF సేవలు అందించాలని యోచిస్తున్నామన్నారు. ‘ఒకప్పుడు 3.0గా ఉన్న ఫెర్టిలిటీ రేట్ 1.5కి తగ్గిపోయింది. దీనివల్ల పనిచేసే వారి సంఖ్య తగ్గి ఆర్థిక వృద్ధి పడిపోతుంది. టీనేజ్ గర్భధారణలు తగ్గించే చర్యలు చేపడుతున్నాం’ అని CBN పేర్కొన్నారు.
News March 5, 2026
తెలంగాణ టెన్త్ హాల్ టికెట్లు వచ్చేశాయ్..

TG: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. <
Share It
News March 5, 2026
మిడిల్ ఈస్ట్‌లో వార్.. మధ్యవర్తిత్వానికి సిద్ధం: చైనా

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధానికి దౌత్య పరిష్కారం అవసరమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ అభిప్రాయపడ్డారు. అమెరికా-ఇజ్రాయెల్vs ఇరాన్ వార్ ముగించేందుకు మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటించారు. శాంతి కోసం దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే UAE ప్రెసిడెంట్ నహ్యాన్‌తో సహా గల్ఫ్ దేశాల నాయకులతో చర్చించినట్లు పేర్కొన్నారు. యుద్ధం విస్తరిస్తే ఎవరూ లాభపడరని, ప్రజలే నష్టపోతారని చెప్పారు.


