News November 13, 2024
స్కూళ్లకు కీలక ఆదేశాలు

AP: నవంబర్ 14న అన్ని స్కూళ్లల్లో నిర్వహించాల్సిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ వాయిదా పడింది. ఈ మేరకు అన్ని స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ మొదటివారంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది. త్వరలోనే కొత్త తేదీ, ఇతర వివరాలను వెల్లడిస్తామని చెప్పింది.
Similar News
News January 23, 2026
కడప: రూ.144 చెల్లిస్తే కొండంత భరోసా..!

కడప జిల్లాలో పాడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రాయితీతో కూడిన బీమాను ఈనెల 19 నుంచి అందుబాటులోకి తెచ్చింది. కేవలం 15% చెల్లింపుతో ఆవు, గేదె, గొర్రె, మేకలు చనిపోతే పాడిరైతు ఖాతాలో నగదు జమవుతోంది. ఈనెల 31వరకు జరుగే పశుఆరోగ్య శిబిరాల్లో నమోదు చేసుకోవాలి. మేలుజాతి ఆవులు, గేదెలు ఒక్కోదానికి మూడేళ్లకు రూ.288, నాటుజాతి పశువులకు మూడేళ్లకు రూ.144, గొర్రెలు, మేకలకు మూడేళ్ల కాలానికి రూ.56 చెల్లించాలి.
News January 23, 2026
రెండు వారాల్లో గ్రీన్లాండ్పై క్లారిటీ: ట్రంప్

గ్రీన్లాండ్ డీల్ విషయంలో పురోగతి కనిపిస్తోందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి దానికి సంబంధించిన వ్యవహారాలు సజావుగా సాగుతున్నాయని.. మరో 2 వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతకొన్ని వారాలుగా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామంటూ ఆయన హెచ్చరిస్తున్న నేపథ్యంలో తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఓ దశలో సైనిక చర్యకూ వెనకాడబోమని హెచ్చరించినప్పటికీ తర్వాత వెనక్కి తగ్గారు.
News January 23, 2026
రేషన్ బియ్యంతోపాటు నిత్యావసరాలు: ఉత్తమ్

TG: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు. రేషన్ బియ్యంతోపాటు ఇతర నిత్యావసర సరుకులు అందించేందుకు యోచిస్తున్నామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇచ్చినట్లుగానే నిత్యావసరాలు కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. మరోవైపు 2025-26 వానాకాలం సీజన్లో 71.70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు జమ చేసినట్లు తెలిపారు.


