News November 15, 2024

స్కూళ్లకు కీలక ఆదేశాలు

image

AP: ప్రభుత్వ స్కూళ్ల ఆవరణల్లో వివాహాలు, రాజకీయ, మతపరమైన సమావేశాలను నిషేధిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. పాఠశాలల పనివేళలకు ముందు, తర్వాత, సెలవుల్లో ఇలాంటి కార్యక్రమాలకు ఆర్జేడీలు, డీఈవోలు, HMలు అనుమతిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దని స్పష్టం చేసింది.

Similar News

News November 15, 2024

గ్రేప్4 అమలైతే ఢిల్లీ పరిస్థితి ఏంటి?

image

DL రిజిస్ట్రేషన్ గల BS-6 సొంత వాహనాలు, అత్యవసర సరుకు రవాణా కమర్షియల్ వాహనాలనే నగరంలోకి అనుమతిస్తారు. 6-9, 11వ తరగతులకూ <<14615373>>ఆన్‌లైన్ క్లాసులే<<>> ఉండాలని ప్రభుత్వం ప్రకటించే అధికారం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులకు 50% స్టాఫ్‌నే పిలవాలని ఆదేశించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణ, కూల్చివేత పనుల నిషేధం. కాలుష్యం ఇంకా తీవ్రమైతే అన్ని విద్యాసంస్థలూ మూసేయడంతో పాటు అత్యవసర వాహనాలే తిరిగాలనే ఆంక్షలొస్తాయి.

News November 15, 2024

కిడ్నీ పేషెంట్‌కు తమన్ సాయం

image

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గొప్ప మనసు చాటుకున్నారు. ఓ పేషెంట్‌కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం సాయం చేశారు. ఈ విషయాన్ని AINU ఆస్పత్రి వైద్యుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. దీనికి ‘గాడ్ ఈజ్ గ్రేట్’ అంటూ తమన్ తన ఇన్‌స్టా స్టోరీలో రిప్లై ఇచ్చారు. దీంతో పలువురు ఆయన సేవాగుణాన్ని ప్రశంసిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి.

News November 15, 2024

లోకేశ్ నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: అంబటి

image

AP: వైసీపీ నేతలు తన తల్లిని అవమానించారని మంత్రి నారా <<14608443>>లోకేశ్<<>> చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘లోకేశ్.. శాసనసభలో మీ తల్లిగారిని అవమానించినట్లు నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయ నిష్క్రమణ చేస్తాను’ అని ట్వీట్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసులు పెడితే ముందుగా ప్రస్తుత స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌పైన పెట్టాలని, వారిని అరెస్టు చేయాలని అంబటి పేర్కొన్నారు.