News June 26, 2024
పరువు నష్టం కేసులో రాహుల్‌కు కీలక ఆదేశాలు

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ జులై 2న కోర్టుకు హాజరుకావాలని యూపీలోని సుల్తాన్పూర్ జిల్లాలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ఆదేశించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తాను చేసిన ఆరోపణలపై దాఖలైన పరువునష్టం కేసుకు సంబంధించి స్టేట్మెంట్ను నమోదు చేసేందుకు రావాలని రాహుల్‌కు సూచించింది. బెంగళూరులో ఓ విలేకరుల సమావేశంలో అమిత్ షాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీపై 2018 ఆగస్టు 4న కేసు నమోదైంది.
Similar News
News November 27, 2025
స్విగ్గీని బురిడీ కొట్టించిన కస్టమర్.. నెటిజన్ల ఫైర్!

ఆన్లైన్ సైట్స్‌లో వస్తువులు డ్యామేజ్ వస్తే సదరు సంస్థ రీఫండ్ చేయడం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి డూప్లికేట్ ఫొటోతో ‘స్విగ్గీ ఇన్‌స్టామార్ట్’ను బురిడీ కొట్టించాడు. స్విగ్గీలో ఆర్డర్ చేసిన గుడ్ల ట్రే ఫొటోను, జెమిని నానో AI యాప్ ద్వారా గుడ్లు పగిలినట్లుగా ఎడిట్ చేసి కస్టమర్ కేర్‌కు పంపి, పూర్తి రీఫండ్‌ను పొందాడు. ఇలా చేయడం సరికాదని, నిజమైన బాధితులు నష్టపోతారని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
News November 27, 2025
MLC రాజీనామాపై 4 వారాల్లో తేల్చండి: హైకోర్టు

AP: MLC జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖపై నిర్ణయాన్ని తెలపాలని మండలి ఛైర్మన్‌ను హైకోర్టు ఆదేశించింది. రాజీనామాపై సుదీర్ఘకాలం నిర్ణయం తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. విచారణ జరిపి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. రాజీనామా లేఖ సమర్పించినప్పటికీ చైర్మన్ ఆమోదించడం లేదని జయమంగళ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.
News November 27, 2025
ఢిల్లీలో మరింత పడిపోయిన గాలి నాణ్యత!

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. నేడు ఉదయం గాలి నాణ్యత AQI 351గా రికార్డైంది. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాలతోపాటు బురారీ, ఆనంద్ విహార్, చందానీ చౌక్, ఐటీఓ, జహంగీర్ పురి ఏరియాల్లో AQI 300 కంటే ఎక్కువ ఉంది. బుధవారం సాయంత్రం 327 వద్ద ఉన్న గాలి నాణ్యత ఈరోజు ఉదయానికి మరింత దిగజారింది. వరుసగా 21వ రోజు కూడా AQI 300 కంటే ఎక్కువ నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది.


