News June 7, 2024

నేడు ఎన్డీయే ఎంపీల కీలక భేటీ

image

కేంద్ర కేబినెట్‌ కూర్పుపై ఉత్కంఠ నేపథ్యంలో నేడు NDA MPల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం కోసం TDP అధినేత చంద్రబాబు ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ MPలంతా ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. ఈనెల 9న సాయంత్రం 6గంటలకు మోదీ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మంత్రి పదవుల కేటాయింపును ప్రధాని నిర్ణయానికే వదిలేయాలని TDP భావిస్తున్నట్లు సమాచారం.

Similar News

News January 22, 2026

రోహిత్ శర్మకు డాక్టరేట్

image

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మకు మరో గౌరవం దక్కనుంది. క్రికెట్‌లో ఆయన చేసిన సేవలకు గాను డాక్టరేట్ అందజేయనున్నట్లు అజింక్య డీవై పాటిల్ వర్సిటీ వెల్లడించింది. పుణేలో ఈ శనివారం జరగనున్న వర్సిటీ 10వ స్నాతకోత్సవ కార్యక్రమంలో హిట్‌మ్యాన్‌కు డాక్టరేట్ ప్రదానం చేయనుంది. రోహిత్ కెప్టెన్‌గా, ఆటగాడిగా భారత జట్టుకు టీ20 WC, ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఎన్నో విజయాలు అందించారు.

News January 22, 2026

గర్భిణులు రోజుకెంత ఉప్పు తీసుకోవాలంటే..

image

గర్భిణులు రోజుకి 3.8 గ్రాముల ఉప్పు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. తప్పనిసరి పరిస్థితుల్లో 5.8గ్రాముల వరకు తీసుకోవచ్చు. దీని కంటే ఎక్కువగా తీసుకుంటే కాళ్లు, చేతుల వాపులు, తరచుగా మూత్రవిసర్జన, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయని గైనకాలజిస్ట్‌లు చెబుతున్నారు. మరీ తక్కువ ఉప్పు తీసుకున్నా బలహీనత, అలసట, నీరసం వంటివన్నీ వస్తాయి. కాబట్టి సరైన మోతాదులో మాత్రమే ఉప్పు తీసుకోవాలని చెబుతున్నారు.

News January 22, 2026

వైద్యవిద్యా పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: సత్యకుమార్

image

AP: వైద్యవిద్యా పరీక్షలు మరింత పకడ్బందీగా, పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. NTR హెల్త్ వర్సిటీలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ‘37 GOVT, PVT వైద్య కళాశాలల CC కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానించాం. విద్యార్థుల ప్రతి కదలిక కంప్యూటర్లలో నిక్షిప్తం అవుతుంది. వర్సిటీ నిర్వహించే అన్ని పరీక్షలను దశల వారీగా వీటితో పరిశీలిస్తాం’ అని చెప్పారు.