News July 2, 2024
DSC అభ్యర్థులకు ముఖ్య గమనిక

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(<<13547818>>TET<<>>)కు జులై 4 నుంచి 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పేపర్-1A SGTలకు, పేపర్-1B స్పెషల్ ఎడ్యుకేషన్ SGTలకు, పేపర్-2A స్కూల్ అసిస్టెంట్లకు, పేపర్-2B ప్రత్యేక విద్య స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్, PG టీచర్లకు ప్రత్యేకంగా ఇంగ్లిష్ స్కిల్ ఎగ్జామ్ ఉంటుంది. టెట్ సిలబస్, షెడ్యూల్, నోటిఫికేషన్, అప్డేట్స్ <
Similar News
News December 7, 2025
కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్: స్టెయిన్

టీమ్ ఇండియాపై వన్డే సిరీస్ కోల్పోవడం కాస్త నిరుత్సాహ పరిచిందని SA మాజీ పేసర్ డేల్ స్టెయిన్ పేర్కొన్నారు. ‘ఇది ఒక బ్యాడ్ డే. సిరీస్ డిసైడర్లో తప్పులకు తావుండకూడదు. టీమ్ ఇండియాకి శుభాకాంక్షలు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ(65*) అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్. నేను 20-20 మ్యాచుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. IND-SA మధ్య 5 టీ20ల సిరీస్ డిసెంబర్ 9 నుంచి కటక్ వేదికగా ప్రారంభంకానుంది.
News December 7, 2025
మీ ఇంట్లో ఏడు గుర్రాల చిత్ర పటం ఉందా?

పరిగెడుతున్న 7 గుర్రాల చిత్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఉత్తర దిశలో ఉంచితే సిరి సంపదలకు లోటుండదని, దక్షిణ దిశలో ఉంచితే చేసే పనుల్లో విజయం లభిస్తుందని అంటున్నారు. ‘ఈ చిత్రం శ్రేయస్సు, విజయాన్ని సూచిస్తుంది. దీన్ని పూజా మందిరంలోనే పెట్టాల్సిన అవసరం లేదు. సూర్య భగవానుడి వాహనం అయిన రథాన్ని ఈ తెలుపు గుర్రాలే లాగుతాయి’ అని వివరిస్తున్నారు.
News December 7, 2025
అర్ధరాత్రి తినే అలవాటు ఎంత ప్రమాదమంటే?

అర్ధరాత్రి తినే అలవాటు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘లేట్ నైట్ తినే అలవాటు మీ నిద్ర, జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. రాత్రి సమయంలో మీ శరీరం ఫ్యాట్ని బర్న్ చేస్తుంది. కానీ, మీరు తినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ మోడ్ కాస్తా స్టోరేజ్ మోడ్కు వెళ్తుంది. దాంతో మీ శరీరం బరువు పెరుగుతుంది. అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది’ అని చెబుతున్నారు.


