News May 17, 2024
తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు

తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్ బదులుగా టీజీగా మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్‌లలో టీజీగా ఉండాలని పేర్కొంది. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటానమస్ విభాగాలన్నీ దీనిని పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లలో TS స్థానంలో TGని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News February 14, 2026
NCPల విలీనం జరగదు: సంజయ్ రౌత్

మహారాష్ట్రలో దివంగత అజిత్ పవార్ NCP, శరద్ పవార్ NCPల <<19010034>>విలీనం<<>> లేనట్లేనని శివసేన(UBT) MP సంజయ్ రౌత్ వెల్లడించారు. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని పవార్ తనతో చెప్పారన్నారు. దీనిపై మహా వికాస్ అఘాడీలోని 3 పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. ఆయన 60 ఏళ్లుగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. కాగా ఛాతీ నొప్పితో ఇటీవల ఆస్పత్రిలో చేరిన పవార్ ఇవాళ డిశ్ఛార్జ్ అయ్యారు.
News February 14, 2026
పడమర దిశలో ఇల్లు ఉండకూడదా?

పశ్చిమాన గృహ నిర్మాణం మంచిది కాదని చాలామంది అభిప్రాయం. కానీ ఆ అభిప్రాయం అపోహ మాత్రమేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. అవగాహన లోపంతో ప్రసారమయ్యే అవాస్తవాలను నమ్మకూడదు అంటున్నారు. ‘పడమర దిశకు వరుణుడు అధిపతి. వరుణుడు చల్లగా చూస్తే పాడిపంటలకు లోటుండదు. ఆహ్లాదం, ఆనందం కలిగించే ఆ దేవుడి దిశలో ఇల్లు కట్టుకుంటే ధనరాసులతో కళకళలాడే అవకాశాలు పెరుగుతాయి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 14, 2026
మార్చి నుంచి చకచకా ‘వాహన్’ సేవలు

TG: వాహన యజమానులకు అందించే సేవలు మెరుగుపర్చేలా ప్రభుత్వం మార్చిలో ‘వాహన్‘ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రిజిస్ట్రేషన్, లైసెన్స్ పునరుద్ధరణ, ఫీజుల చెల్లింపు, చిరునామాల మార్పు వంటి ఆన్‌లైన్ సేవలన్నీ ఈ పోర్టల్ ద్వారా అందుతాయి. కేంద్ర ప్రభుత్వ ‘సారథి’ పోర్టల్‌లోని సర్వీసులు దీనిలోనూ ఉంటాయి. ప్రస్తుతం SEC, HYD RTOలలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తేనున్నారు.


