News August 20, 2025

రేపు ఇంపార్టెంట్ అప్‌డేట్: చిరంజీవి

image

‘విశ్వంభర’ సినిమా గురించి రేపు ఉ.9.09 గంటలకు ఇంపార్టెంట్ అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. రిలీజ్ డేట్‌పై స్పష్టతనిస్తారని సమాచారం. వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. అటు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చిరంజీవి నటిస్తున్న సినిమా నుంచి ఎల్లుండి ఆయన బర్త్‌డే సందర్భంగా స్పెషల్ వాయిస్ ఓవర్‌తో టైటిల్ గ్లింప్స్‌ రిలీజ్ చేస్తారని సినీ వర్గాలు తెలిపాయి.

Similar News

News March 28, 2026

APPLY: 1,060 ప్రభుత్వ ఉద్యోగాలు

image

సశస్త్ర సీమా బల్(SSB)లో 1,060 ఉద్యోగాలకు APR 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో 827 కానిస్టేబుల్, 233 హెడ్ కానిస్టేబుల్ పోస్టులున్నాయి. డ్రైవర్, వెటర్నరీ, టైలర్, బార్బర్, కార్పెంటర్, కమ్యూనికేషన్, ఎలక్ట్రీషియన్, స్టీవార్డ్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. టెన్త్, సంబంధిత విభాగాల్లో ITI పాసై, వయసు 18-27 ఏళ్లు ఉండాలి. PET/PST, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://ssb.gov.in/

News March 28, 2026

మొజ్తబా కూడా చనిపోయి ఉంటారు: ట్రంప్

image

ఇరాన్ అగ్ర నాయకులందరినీ హతమార్చామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కూడా మరణించడం లేదా తీవ్రంగా గాయపడి ఉంటారని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఆయన బహిరంగంగా కనిపించలేదని, ప్రకటనలూ వెలువడలేదని గుర్తు చేశారు. ఇరాన్ మిలిటరీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు. ఇవి తప్ప మిగతా విషయాల్లో వారు బాగానే ఉన్నారని భావిస్తున్నట్లు సెటైర్ వేశారు.

News March 28, 2026

మరో రెండు LPG నౌకలు వచ్చేస్తున్నాయ్!

image

భారతీయ LPG నిల్వలకు మరింత బూస్ట్ ఇచ్చేందుకు పెట్రోలియం ఉత్పత్తులను మోసుకొస్తున్న మరో రెండు ఇంధన నౌకలు హార్ముజ్ జలసంధి నుంచి ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల దృష్ట్యా వీటికి రక్షణగా భారత నౌకాదళ యుద్ధనౌకలు ఎస్కార్ట్ ఇవ్వనున్నాయి. దేశ ఇంధన అవసరాల కోసం త్వరలోనే మరిన్ని నౌకలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే మూడు LPG నౌకలు ఇండియాకు చేరాయి.