News September 13, 2025
చైనాపై 50%-100% టారిఫ్స్ వేయండి: NATOకు ట్రంప్ లేఖ

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు చైనాపై 50%-100% టారిఫ్స్ విధించాలని <<7824953>>NATO<<>>కు ట్రంప్ లేఖ రాశారు. ‘NATO దేశాలు రష్యా ఆయిల్ కొనడం ఆశ్చర్యంగా ఉంది. అదే మిమ్మల్ని బలహీనం చేస్తోంది. దీనికి సరేనంటేనే నేను ముందుకెళ్తాను. బలమైన టారిఫ్స్‌తోనే చైనా, రష్యా బంధం బ్రేక్ అవుతుంది. అప్పుడే యుద్ధం ఆగుతుంది. లేదంటే US టైమ్, ఎనర్జీ, మనీ వృథా అవుతాయి’ అని స్పష్టం చేశారు. లేఖలో భారత ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
Similar News
News February 7, 2026
ఇండియా-US డీల్.. చైనాకు లాభం!

ఇండియా, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంతో పరోక్షంగా చైనా లాభపడుతోంది. US ఆంక్షల నేపథ్యంలో రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లను భారత్ తగ్గించింది. దీంతో చైనా వైపు రష్యా మొగ్గుచూపింది. ఒక్కో బ్యారెల్‌పై 12 డాలర్ల డిస్కౌంట్‌ను ఆఫర్ చేసింది. ఇప్పటికే రష్యా చమురులో చైనా 47% వరకు కొంటుండటం గమనార్హం. మరోవైపు 2024 డిసెంబర్‌తో పోలిస్తే గతేడాది డిసెంబర్‌లో ఇండియాకు రష్యన్ ఆయిల్ దిగుమతులు 27.5% తగ్గిపోయాయి.
News February 7, 2026
IND-US ట్రేడ్ అగ్రిమెంట్‌తో గ్రామీణ జీవనోపాధి: కేంద్ర మంత్రి

IND-US ఇంటరిమ్ వాణిజ్య ఒప్పందంతో వికసిత్ భారత్ వైపు కీలక అడుగుపడిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ‘గ్రామీణ ప్రజల జీవనోపాధికి భరోసా లభించింది. మొక్కజొన్న, సోయా, పాలు, పౌల్ట్రీ, ఇథనాల్, టొబాకో, పలురకాల కూరగాయలు, మాంసం రంగాలు సురక్షితంగా ఉన్నాయి. ప్రజా సంక్షేమం, వ్యాపారాభివృద్ధితోపాటు ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని ఈ అగ్రిమెంట్ బలోపేతం చేస్తుంది’ అని SMలో పేర్కొన్నారు.
News February 7, 2026
ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాలకు నోటిఫికేషన్

AP: విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో 25% సీట్లు ఫ్రీగా కేటాయించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైనవారు https://cse.ap.gov.in/లో FEB 20 నుంచి మార్చి 10 వరకు అప్లై చేసుకోవాలి. లాటరీ విధానంలో మార్చి 25, ఏప్రిల్ 12న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. అనాథలు, దివ్యాంగులు, HIV బాధితులు, SC, ST, BCలకు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు.


