News January 17, 2025
ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్లు, భార్యకు 7 ఏళ్ల జైలు శిక్ష

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌కు లోకల్ కోర్టు 14 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఆయన భార్యకు సైతం ఏడేళ్ల జైలుశిక్ష పడింది. ఇమ్రాన్ ఖాన్ దేశ ఖజానాకు 190 మిలియన్ పౌండ్ల నష్టం కలిగించారని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) 2023 DECలో కేసు నమోదు చేసింది.
Similar News
News December 29, 2025
క్యాబినెట్ సమావేశం ప్రారంభం..

AP: సీఎం CBN అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. మొత్తం 20 అజెండాలపై చర్చించనుంది.
*అమరావతి అభివృద్ధికి నాబార్డు నుంచి రూ.7,387 కోట్ల రుణాలు
*అటవీశాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీ
*ఉద్యోగుల డీఏ పెంపు అమలుకు ఆర్థికశాఖ అనుమతికి ఆమోదం
*గ్రామ, వార్డు సచివాలయాల పేర్ల మార్పుపై ఆర్డినెన్స్
*జిల్లా కోర్టుల్లో సిస్టమ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ల పోస్టులు
News December 29, 2025
ఈ మెడిసిన్ కొంటున్నారా?

అనారోగ్యానికి గురైన సమయంలో తీసుకునే కొన్ని ట్యాబ్లెట్స్ స్ట్రిప్స్‌పై ఉండే ఎర్రటి గీతను ఎప్పుడైనా గమనించారా? రెడ్‌లైన్ ఉంటే వైద్యుడి సలహా లేకుండా వినియోగించకూడదని కేంద్రం చెబుతోంది. యాంటీబయాటిక్స్ ఇష్టారీతిన తీసుకోవడం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌కు దారితీస్తుందని హెచ్చరించింది. ఇలాంటి విషయాల్లో బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. మెడిసిన్ కొనే సమయంలో గడువు తేదీతో పాటు రెడ్ లైన్‌ను గమనించండి.
News December 29, 2025
రాష్ట్రంలో 66 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


