News December 27, 2024
YCPకి ఇంతియాజ్ రాజీనామా

AP: కర్నూలు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. విశ్రాంత IAS అధికారి ఇంతియాజ్ అహ్మద్ వైసీపీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన టీజీ భరత్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్న ఆయన తాజాగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఇకపై సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటానని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News November 23, 2025
యాలాల: పెళ్లింట విషాదం.. పెళ్లికూతురి తండ్రి మృతి

కూతురు పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసిన తండ్రికి అనుకోని ప్రమాదం జరిగింది. సంగంకుర్డు గ్రామానికి చెందిన అండాల అనంతయ్య తన కూతురి పెళ్లి ఆదివారం నిశ్చయించారు. పెళ్లికి ముందు ఇంట్లో బంధువుల సందడి నెలకొన్న సమయంలో, అనంతయ్య బైక్ పైనుంచి పడి, తీవ్ర గాయాలతో మృతి చెందారు. పెళ్లికి వచ్చిన వారే అంత్యక్రియల్లో పాల్గొనడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
News November 23, 2025
రేషన్ కార్డులు ఉన్న వారికి ఫ్రీగా క్లాత్ బ్యాగులు?

TG: వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఉన్న వారికి సన్నబియ్యంతో పాటు మల్టీ పర్పస్ క్లాత్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ప్లాస్టిక్ వినియోగం తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాగులపై ప్రభుత్వ 6 గ్యారంటీల లోగోలు ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా OCTలోనే ఈ బ్యాగులను పంపిణీ చేయాల్సి ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది.
News November 23, 2025
నాకు పేరు పెట్టింది ఆయనే: సాయిపల్లవి

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ సాయిపల్లవి గతంలో చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. తన అమ్మ, తాతయ్య సాయిబాబాకు భక్తులని తెలిపారు. పుట్టపర్తి సాయి తనను దీవించి పేరు పెట్టినట్లు వెల్లడించారు. తాను కూడా సాయిబాబా భక్తురాలినేనని, ఆయన బోధనలు తనలో ధైర్యం నింపాయని చెప్పారు. ప్రశాంతత, క్రమశిక్షణ, ధ్యానం వంటివి ఆయన నుంచి నేర్చుకున్నట్లు పేర్కొన్నారు.


