News February 10, 2025

11 ఏళ్లలో.. మోదీ 86 విదేశీ పర్యటనలు

image

ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు నేడు బయల్దేరనున్నారు. గడిచిన 11 ఏళ్లలో ఆయన 86 విదేశీ పర్యటనలు చేసి దౌత్యపరమైన సమావేశాలు నిర్వహించారు. 2014లో తొలిసారి ప్రధాని కాగానే ఆయన భూటాన్ వెళ్లారు. ఆ తర్వాత బ్రెజిల్, నేపాల్, జపాన్.. ఇలా దశాబ్ద కాలంగా పర్యటనలు చేశారు. గతేడాది 11 విదేశీ పర్యటనలు చేసిన మోదీకి ఈ ఏడాది ఇదే తొలి పర్యటన.

Similar News

News November 22, 2025

‘డిజిటల్ గోల్డ్‌’ను నియంత్రించం: సెబీ చీఫ్

image

డిజిటల్ గోల్డ్, ఈ-గోల్డ్‌ ఉత్పత్తులు తమ పరిధిలో లేవని, వాటిని నియంత్రించాలని అనుకోవడం లేదని SEBI చీఫ్ తుహిన్ పాండే తెలిపారు. సెబీ పరిధిలోని మ్యూచువల్ ఫండ్స్‌ ETFలు, ఇతర గోల్డ్ సెక్యూరిటీస్‌లో పెట్టుబడి పెట్టాలని సూచించారు. డిజిటల్ గోల్డ్ తమ పరిధిలోకి రాదని, అది రిస్క్‌ అని ఇటీవల సెబీ హెచ్చరించింది. దీంతో తమనూ నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలని డిజిటల్ గోల్డ్ పరిశ్రమ కోరడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు.

News November 22, 2025

లేబర్ కోడ్స్‌పై మండిపడ్డ కార్మిక సంఘాలు

image

కేంద్రం అమల్లోకి తెచ్చిన 4 <<18350734>>లేబర్ కోడ్స్‌<<>>ను కార్మిక సంఘాలు ఖండించాయి. కార్మికులకు నష్టం కలిగించేలా, కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయని 10 లేబర్ యూనియన్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ‘ఇది అత్యంత అప్రజాస్వామిక చర్య. శ్రామికులపై యుద్ధం ప్రకటించడం తప్ప మరేమీ కాదు. పెట్టుబడిదారులతో ప్రభుత్వం కుమ్మక్కైంది’ అని మండిపడ్డాయి. లేబర్ కోడ్స్‌ను విత్ డ్రా చేసుకునే దాకా తాము పోరాటం చేస్తామని ప్రకటించాయి.

News November 22, 2025

20 ఏళ్ల తర్వాత కీలక శాఖ వదులుకున్న నితీశ్

image

కొత్తగా కొలువుదీరిన బిహార్ క్యాబినెట్‌లో మంత్రులకు శాఖల కేటాయింపులు పూర్తయ్యాయి. 20 ఏళ్లుగా తన వద్దే ఉంచుకున్న కీలకమైన హోం శాఖను సీఎం నితీశ్ కుమార్ వదులుకున్నారు. డిప్యూటీ సీఎం చౌధరి(BJP)కి ఇచ్చారు. మరో డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా(BJP)కు రెవెన్యూ, గనుల శాఖలు కేటాయించారు. సాధారణ పరిపాలన, విజిలెన్స్ వంటి శాఖలు మాత్రమే నితీశ్ తన వద్ద ఉంచుకున్నారు.