News April 4, 2024

1962లోనే 38వేల చ.కి.మీ భూమిని కోల్పోయాం: జైశంకర్

image

భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటోందని ఇండియా కూటమి చేస్తోన్న విమర్శలను విదేశాంగ మంత్రి జైశంకర్ ఖండించారు. 1962లోనే 38 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోయామని చెప్పారు. 2000 తర్వాత ఆక్రమణ జరిగిందని ఆరోపించడం సరి కాదన్నారు. పాక్, చైనాను మినహాయిస్తే మిగతా పొరుగుదేశాలతో భారత సంబంధాలు గతంలో కంటే మెరుగ్గానే ఉన్నాయని తెలిపారు. POK ఎప్పటికీ భారత్‌లో భాగమేనని స్పష్టం చేశారు.

Similar News

News December 25, 2025

Money Tip: జీతం పెరిగినా జేబు ఖాళీనా? ‘లైఫ్‌స్టైల్ క్రీప్‌’లో పడ్డట్టే!

image

ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరగడాన్ని ‘లైఫ్‌స్టైల్ క్రీప్’ అంటారు. జీతం పెరగ్గానే లగ్జరీ వస్తువులు కొనడం, ఖరీదైన అలవాట్లు చేసుకోవడం వల్ల పొదుపు తగ్గుతుంది. భవిష్యత్తు కోసం దాచుకోవాల్సిన సొమ్ము విలాసాలకే ఖర్చవుతుంది. ఈ మార్పు మనిషికి సంపదను దూరం చేస్తుంది. అనవసర ఖర్చులను నియంత్రించి, పెరిగిన ఆదాయాన్ని పెట్టుబడిగా మలచడం ముఖ్యం. అప్పుడే ఆర్థిక స్వేచ్ఛను సాధిస్తారు.

News December 25, 2025

పుణే పోరు: ఓటుకు కారు.. థాయిలాండ్ టూరు!

image

పుణే మున్సిపల్ ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను వరాల జల్లుతో ప్రలోభపెడుతున్నారు. థాయిలాండ్ ట్రిప్పులు, ఖరీదైన కార్లు, ప్లాట్లు, బంగారం వంటి ఆఫర్లు ఇస్తున్నారు. మహిళల కోసం చీరలు, కుట్టు మిషన్లు పంచుతున్నారు. క్రికెట్ టోర్నీలు పెట్టి నగదు బహుమతులు ప్రకటిస్తున్నారు. మరోవైపు సీట్ల సర్దుబాటుపై పవార్ వర్గాల మధ్య చర్చలు జరుగుతుంటే ఠాక్రే సోదరులు ఒక్కటవ్వడం మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

News December 25, 2025

ఆ దేశంలో 4 నెలలు క్రిస్మస్ వేడుకలు

image

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వారం నుంచి 10 రోజులు క్రిస్మస్ వేడుకలు చేసుకుంటారు. ఫిలిప్పీన్స్‌ దేశంలో మాత్రం సుమారు 4 నెలలు విందు వినోదాలతో సెలబ్రేషన్స్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 1న మొదలయ్యే క్రిస్మస్ సెలబ్రేషన్స్ జనవరి మొదటి వారం (త్రీ కింగ్స్ డే) వరకు కొనసాగుతాయి. డిసెంబర్ 16-24 వరకు ‘సింబాంగ్ గబీ’ పేరుతో ప్రత్యేక ప్రార్థనలు చేసి, 24వ తేదీ అర్థరాత్రి ‘నోచే బ్యూనా’ విందుతో ఎంజాయ్ చేస్తారు.