News August 22, 2024

2023లో దేశవ్యాప్తంగా 65 లక్షల మంది ఫెయిల్

image

2023లో దేశవ్యాప్తంగా 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో 65 లక్షల మందికి పైగా విద్యార్థులు పాస్ కాలేదని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఇందులో సెంట్రల్ బోర్డు కంటే స్టేట్ బోర్డుల్లోనే ఫెయిల్యూర్ రేటు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. టెన్త్‌లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిలైన జాబితాలో మధ్యప్రదేశ్, బిహార్, యూపీ తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. ఇక 12వ తరగతిలో యూపీ, మధ్యప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఫెయిలయ్యారు.

Similar News

News January 15, 2025

430 విజయాలు.. చరిత్ర సృష్టించిన జకోవిచ్

image

ఆస్ట్రేలియా ఓపెన్ మూడో రౌండ్‌కు చేరుకున్న సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించారు. ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అత్యధిక మ్యాచ్‌లు(430) గెలిచిన ప్లేయర్‌గా ఘనత సాధించారు. గతంలో ఫెదరర్(429) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. జకోవిచ్ ఇప్పటికే అత్యధిక గ్రాండ్‌స్లామ్(24)లను గెలిచిన ప్లేయర్‌గానూ కొనసాగుతున్నారు. ఇందులో 10 ఆస్ట్రేలియా ఓపెన్, 7 వింబుల్డన్, 4 యూఎస్ ఓపెన్, 3 ఫ్రెంచ్ ఓపెన్‌లు ఉన్నాయి.

News January 15, 2025

పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టులో ఊరట

image

తప్పుడు పత్రాలతో ఐఏఎస్‌కు ఎంపికయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. వచ్చే నెల 14 వరకు ఆమెను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వం, యూపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు <<14959397>>కొట్టేయడంతో<<>> సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

News January 15, 2025

‘డాకు మహారాజ్’ మూడు రోజుల కలెక్షన్లు ఎంతంటే?

image

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.92 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ సీన్స్‌తో కూడిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి తప్పకుండా చూడాలి అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాను చూశారా? COMMENT