News March 1, 2025
రూ.3.2లక్షల కోట్ల బడ్జెట్‌లో.. రూ.లక్ష కోట్ల అప్పు

AP: రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో రూ.3.2లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా, తాజా బడ్జెట్ అమలుకు రూ.లక్ష కోట్ల అప్పు అవసరం కానుంది. ఇందులో బహిరంగ మార్కెట్ నుంచి రూ.80వేల కోట్లు, కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థల నుంచి మిగతా రుణం తీసుకోనున్నట్లు బడ్జెట్ పత్రాల్లో ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు, రూ.3.22లక్షల కోట్లలో రెవెన్యూ రాబడి రూ.2.17లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేసింది.
Similar News
News March 1, 2025
నోటికొచ్చినట్లు మాట్లాడితే కుదరదు: హోంమంత్రి

AP: కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అంతర్యుద్ధం లేదని, YCPలో రాకుండా చూసుకోవాలని హోంమంత్రి అనిత అన్నారు. తప్పు చేసిన వారిని వదలబోమని చెప్పారు. నోటికొచ్చినట్లు మాట్లాడతామంటే కుదరదని హెచ్చరించారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులున్నాయని, ఆయన వ్యాఖ్యలను ఎవరూ క్షమించరని చెప్పారు. తాము రెడ్‌బుక్ ప్రకారం ముందుకెళ్తే YCP నేతలు రోడ్లపై తిరగలేరన్నారు. కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు.
News March 1, 2025
ప్రియుడితో దాడి చేయించిన భార్య.. మృత్యువుతో పోరాడి భర్త మృతి

TG: వరంగల్‌లో 8 రోజులుగా మృత్యువుతో పోరాడి వైద్యుడు సుమంత్ రెడ్డి నేడు చనిపోయారు. FEB 20న ఇతనిపై భార్య మరియా ప్రియుడితో దాడి చేయించింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిమ్‌లో శామ్యూల్‌తో మరియాకు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో సుమంత్ కాపురాన్ని WGLకు మార్చారు. భర్త అడ్డు తొలగించుకోవాలని ఆమె ప్లాన్ వేయగా వీరికి కానిస్టేబుల్ రాజ్ హెల్ప్ చేశాడు. ప్రస్తుతం ముగ్గురూ అరెస్ట్ అయ్యారు.
News March 1, 2025
పచ్చబొట్లతో HIV, హెపటైటిస్ ముప్పు!

పచ్చబొట్లు వేసేందుకు వాడుతున్న ఇంక్, అపరిశుభ్రత విధానాలతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని కర్ణాటక ప్రభుత్వం గుర్తించింది. నాసిరకం రసాయనాలు వాడి వేస్తున్న టాటూలలో చర్మ క్యాన్సర్ వస్తున్నట్లు నిర్ధారించింది. అలాగే రోడ్డు పక్కన శుభ్రత లేకుండా, సూది మార్చకుండా పచ్చబొట్టు వేస్తుండటంతో HIV, హెపటైటిస్ సోకుతున్నట్లు వైద్యశాఖ తెలిపింది. పచ్చబొట్లపై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయాలని ఆ ప్రభుత్వం కోరింది.