News June 12, 2024
కాసేపట్లో ‘పవన్ కళ్యాణ్ అనే నేను’..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘కింగ్ మేకర్’గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ నేడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ ఉద్విగ్న క్షణాల కోసం లక్షలాది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 2014లో జనసేన పార్టీ పెట్టిన పవన్ ఆ ఏడాది ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో పవన్ రెండు చోట్లా ఓడిపోయారు. అప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న జనసేనాని.. 100% స్ట్రైక్ రేటుతో 21కి 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు సాధించారు.
Similar News
News November 20, 2025
HNK: ‘బాలల హక్కుల పరిరక్షణకు సమన్వయం అవసరం’

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ ఏ. వెంకట్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలలు దేశ సంపద అని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదీ అని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలను తిలకించి, వారిని అభినందించి బహుమతులు అందించారు.
News November 20, 2025
AP న్యూస్ రౌండప్

*రైతుల నుంచి ప్రతి ధాన్యం బస్తా కొంటాం: మంత్రి నాదెండ్ల మనోహర్
*బిహార్ CM నితీశ్ కుమార్‌కు YS జగన్ శుభాకాంక్షలు
*గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలకృష్ణకు సత్కారం
*డిసెంబర్ 15 నుంచి అమరావతి రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో సరిహద్దుల్లేని ప్లాట్లకు కొత్త పెగ్ మార్క్‌లు వేసే ప్రక్రియ ప్రారంభం
*2026లో రిటైర్ కానున్న ఐదుగురు IAS అధికారులను నోటిఫై చేసిన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్
News November 20, 2025
ఢిల్లీకి డీకే శివకుమార్.. సీఎం మార్పుపై జోరుగా ప్రచారం

కర్ణాటకలో CM మార్పు ప్రచారం మరోసారి జోరందుకుంది. Dy.CM డీకే శివకుమార్ మరికొంత మంది MLAలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. KAలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో రెండున్నరేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ‘పవర్ షేరింగ్’ కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకే ఆయన ఢిల్లీ బాటపట్టారని చర్చ జరుగుతోంది. ఇవాళ రాత్రికి ఖర్గేతో, రేపు KC వేణుగోపాల్‌తో DK వర్గం భేటీ కానుంది. దీంతో సీఎం మార్పుపై ఉత్కంఠ నెలకొంది.


