News October 21, 2024
అదనంగా 1.4లక్షల మందికి పంట రుణాలు!

AP: ఈ రబీ సీజన్‌లో రైతులకు లక్ష కోట్ల రుణ పరపతి కల్పించాలని వ్యవసాయశాఖ నిర్దేశించింది. అందులో రూ.68,060 కోట్లు పంట రుణాలు, రూ.32,390 కోట్లు టర్మ్ లోన్స్ ఇవ్వనుంది. గత సంవత్సరం 3.60 లక్షల మంది కౌలు దారులకు రూ.4,100 కోట్లు రుణాలు ఇచ్చింది. కాగా ఈసారి కనీసం 5 లక్షల మందికి రూ.5వేల కోట్ల రుణాలివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
Similar News
News February 4, 2026
పదిలమైన ఇంటికి పంచ సూత్రాలు

ఇల్లు పదిలంగా ఉండేందుకు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు ‘పంచసూత్రాలు’ సూచిస్తున్నారు. అవి 1. సరైన వాస్తుతో స్థలం ఎంపిక, 2. పనుల నిర్వహణకు పక్కా ప్లానింగ్, 3. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే బలమైన స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, 4. అవసరాలకు అనుగుణంగా వస్తువుల అమరిక తెలిపే ఇంటీరియర్ డిజైన్, 5. ఇంటి అందాన్ని పెంచే ఇంటీరియర్ డెకరేషన్. ఈ 5 అంశాల మేళవింపుతోనే ఇల్లు సేఫ్, అందంగా ఉంటుందని ఆయన అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 4, 2026
పవన్‌ను కలిసిన రాజేంద్ర ప్రసాద్

AP: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇవాళ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. రాజేంద్ర ప్రసాద్‌ను పవన్ అభినందించారు.
News February 4, 2026
అఫ్గాన్‌పై ఘన విజయం.. ఫైనల్‌కు భారత్

U19WCలో టీమ్ ఇండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్లో అఫ్గాన్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. 41.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని(311) ఛేదించింది. జార్జ్(115) శతకంతో చెలరేగారు. వైభవ్ సూర్యవంశీ(68), ఆయుశ్ మాత్రే(62), విహాన్ మల్హోత్రా(38) అదరగొట్టారు. కుర్రాళ్లను కట్టడి చేయడంలో అఫ్గాన్ బౌలర్లు చేతులెత్తేశారు. నూరిస్తానీ 2, జద్రాన్ 1 వికెట్ మాత్రమే తీశారు. FEB 6న ENG-19, IND-19 ఫైనల్లో తలపడనున్నాయి.


