News June 8, 2024
మరో 2 నెలల్లో ‘ఈనాడు’కు 50 ఏళ్లు.. అంతలోనే..
రామోజీరావు మానస పుత్రిక ‘ఈనాడు’ ప్రారంభించి ఈఏడాది ఆగస్టు 10 నాటికి 50 ఏళ్లు పూర్తవుతాయి. 1974లో ఈనాడు ప్రస్థానాన్ని ప్రారంభించిన రామోజీరావు ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ, ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ సంచలనం సృష్టించారు. నిత్యం తె.జా 3-4 గంటల మధ్య ఈనాడు పేపర్ చదవడం ఆయనకు అలవాటు. మరో 2 నెలల్లో ఆ పేపర్‌కు 50 ఏళ్లు నిండనుండగా ఈ అరుదైన ఘట్టాన్ని చూడకుండానే రామోజీరావు కన్నుమూయడం విషాదకరం.
Similar News
News January 11, 2025
మా కార్యకర్తల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాం: కేటీఆర్
యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ కార్యాలయంపైన జరిగిన దాడిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అది కాంగ్రెస్ గూండాల దాడి అని ఆరోపించారు. ‘మా పార్టీ కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ గూండారాజ్యం నడుస్తోంది. ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. దాడికి పాల్పడిన గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలి’ అని ట్విటర్లో డిమాండ్ చేశారు.
News January 11, 2025
ప్రముఖ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్
ప్రముఖ హిందీ నటుడు, కమెడియన్ టీకూ తల్సానియా(70) బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్లు భార్య దీప్తి వెల్లడించారు. ప్రస్తుతం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆయనకు గుండెపోటు అంటూ వచ్చిన వార్తలను ఖండించారు. 1986లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టీకూ దాదాపు 200 చిత్రాలు, 11 సీరియళ్లలో కీలక పాత్రలు పోషించారు. ఆయన కూతురు శిఖ కూడా సత్యప్రేమ్ కీ కథ, వీర్ దీ వెడ్డింగ్ లాంటి చిత్రాల్లో నటించారు.
News January 11, 2025
వైసీపీ హయాంలో పోలవరం ధ్వంసం: రామానాయుడు
AP: పోలవరం ప్రాజెక్టును YCP సర్కార్ 20 ఏళ్లు వెనక్కి నెట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఏడాదిన్నర కష్టపడి డయాఫ్రం వాల్ నిర్మిస్తే YCP దానిని ధ్వంసం చేసిందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన పార్లమెంటరీ కమిటీకి ఆయన స్వాగతం పలికారు. 2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టు 72 శాతం పనులు పూర్తి చేశామన్నారు. సీఎం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.