News July 1, 2024
అయోధ్యలో చిరు వ్యాపారులను రోడ్డుపైకి నెట్టారు: రాహుల్

అయోధ్య ప్రారంభానికి కార్పొరేట్ పెద్దలకు మాత్రమే ఆహ్వానం అందిందని విపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో మండిపడ్డారు. ‘అయోధ్యలో చిరు వ్యాపారుల దుకాణాలు, భవనాలు తొలగించి వారిని రోడ్డుపైకి నెట్టారు. భూములు లాక్కుని విమానాశ్రయం నిర్మించారు. మందిరం ప్రారంభ సమయంలో బాధితులు దు:ఖంలో ఉన్నారు. వారిని కనీసం ఆలయ పరిసరాల్లోకి కూడా రానివ్వలేదు’ అని తీవ్ర విమర్శలు చేశారు.
Similar News
News February 5, 2026
NDSH-1012 పొద్దుతిరుగుడుతో అధిక దిగుబడి

తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న నూనె గింజల పంటల్లో పొద్దుతిరుగుడుకు ప్రత్యేక స్థానం ఉంది. పొద్దుతిరుగుడులో NDSH-1, DRSH-1, KBSH-44 వంటి రకాలు సాగుకు అనువైనవి. అయితే NDSH-1012 అనే హైబ్రీడ్ రకం హెక్టారుకు 18-20 క్వింటాళ్ల దిగుబడినిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిలో నూనె శాతం 40-41%. ఇది బూజుతెగులును తట్టుకుంటుంది. ఈ విత్తనం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం నంద్యాలలో అందుబాటులో ఉంటుంది.
News February 5, 2026
లోక్‌సభకు రావద్దని మోదీకి చెప్పాను: స్పీకర్

ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్నాయని, లోక్‌సభలోకి రావద్దని PM మోదీకి తాను సూచించినట్లు స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. కొందరు MPలు లోక్‌సభ ఛాంబర్‌లో దురుసుగా ప్రవర్తించారన్నారు. ‘<<19056579>>మోదీ ప్రసంగాన్ని<<>> అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని, ఊహించని పరిస్థితికి దారితీయొచ్చని సమాచారం వచ్చింది. అదే జరిగుంటే దేశ గౌరవం దెబ్బతినేది. నిన్నటి ఘటన పార్లమెంటు చరిత్రలో మాయనిమచ్చ’ అని అన్నారు.
News February 5, 2026
90 రోజులుగా నో ఛార్జ్‌షీట్.. ‘శబరిమల’ నిందితుడికి బెయిల్!

శబరిమల బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టికి రెండో కేసులోనూ బెయిల్ వచ్చింది. అతడిని అరెస్టు చేసి 90 రోజులైనా SIT ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడంతో కేరళ కోర్టు statutory bail మంజూరు చేసింది. ద్వారపాలక విగ్రహం, గర్భగుడి తలుపుల ఫ్రేమ్స్‌లో బంగారం మాయంపై 2కేసులు అతడిపై నమోదయ్యాయి. దర్యాప్తులో తప్పు జరుగుతోందన్న తమ ఆరోపణలు ఈ బెయిల్‌తో నిజమని తేలాయని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.


