News June 4, 2024
మెజార్టీలో తండ్రిని మించిన తనయుడు
AP: గత ఎన్నికల్లో ఓటమి పాలైన నారా లోకేశ్ ఈసారి భారీ విజయం సాధించారు. తన తండ్రి చంద్రబాబు మెజార్టీని తలదన్నేలా.. ఏకంగా 90,160 మెజార్టీతో రికార్డు సృష్టించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. CBNకి 47,340 ఓట్ల మెజార్టీ దక్కింది. కుప్పంలో 1989లో CBN తొలిసారి గెలిచినప్పుడు అత్యధికంగా 71,607 మెజార్టీ సాధించారు. ఆ తర్వాత నుంచి మెజార్టీ తగ్గుతూ వస్తోంది. 2009 నుంచి ఆయన మెజార్టీ 45వేల మార్కు దగ్గరే ఉంటోంది.
Similar News
News November 29, 2024
ధరణి సమస్యల పరిష్కార బాధ్యత వారిదే..
TG: ధరణి పోర్టల్‌లో సమస్యల పరిష్కారానికి బాధ్యత అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోలదేనని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్లికేషన్ల పరిష్కారానికి తహశీల్దార్‌కు 7 రోజులు, ఆర్డీవోకు 3 రోజులు, అదనపు కలెక్టర్‌కు 3 రోజులు, కలెక్టర్‌కు 7 రోజుల గడువు ఇచ్చింది. పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించింది.
News November 29, 2024
రూ.1.44 లక్షల కోట్ల టోల్ ఫీజు వసూలు: నితిన్ గడ్కరీ
జాతీయ రహదారులపై ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల ద్వారా 2000 డిసెంబర్ నుంచి ఇప్పటివరకూ రూ.1.44 లక్షల కోట్ల టోల్ ఫీజు వసూలైనట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. LSలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఫాస్టాగ్‌తో పాటు ఎలక్ట్రానిక్ టోల్ కనెక్షన్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత టోల్ విధానం అమల్లోకి రాలేదన్నారు.
News November 29, 2024
శీతాకాలంలో కొందరికే చలి ఎక్కువ.. ఎందుకంటే?
కొందరు ఉన్న చలి కంటే ఎక్కువ చలిని అనుభవిస్తారు. విటమిన్లు, పోషకాల లోపం వల్ల కొందరి శరీరం వేడిని నిర్వహించే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే వారు చలిని ఎక్కువగా ఫీల్ అవుతారు. ఐరన్ లోపం ఉన్న వారి రక్తంలో ఆక్సిజన్ ప్రవాహం తగ్గడంతో ఎక్కువ చలి అనుభవిస్తారు. అలాగే కాళ్లు, చేతుల్లో తక్కువ రక్త ప్రవాహం ఉండేవారికీ చలి ఎక్కువగా పుడుతుంది. సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు.