News June 11, 2024
మోదీ 3.0లో ‘సీనియర్ల’దే హవా!
నూతనంగా ఏర్పాటైన మోదీ మంత్రివర్గంలో 66% మంది 51ఏళ్ల నుంచి 70ఏళ్ల వయసున్న వారేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. అంటే 71 మంది మంత్రుల్లో 47 మంది ఈ వయసు వారు ఉన్నారట. 71Y-80Y మధ్య వయస్సు గల ఏడుగురు మంత్రులు ఉన్నారట. మొత్తం మంత్రి వర్గంలో 10% అన్నమాట. 24%(17మంది) మంత్రులు 31Y-50Y మధ్య ఉన్నారని తెలిపింది. ప్రధాని మోదీ, ఈ మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 23, 2024
అమెరికా జట్టు కెప్టెన్గా తెలుగమ్మాయి
వచ్చే ఏడాది జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు మలేషియా వేదికగా అండర్-19 టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ జరగనుంది. ఇందులో పాల్గొనే అమెరికా జట్టుకు తెలుగు యువతి కొలన్ అనికా రెడ్డి కెప్టెన్గా వ్యవహరించనున్నారు. తెలుగు సంతతికి చెందిన చేతనారెడ్డి, ఇమ్మడి శాన్వి, సాషా వల్లభనేని కూడా అమెరికా తరఫున బరిలో దిగనున్నారు. జట్టులోని 15 మందిలో దాదాపు అందరూ ఇతర దేశాల సంతతికి చెందిన వారే కావడం గమనార్హం.
News December 23, 2024
సంక్రాంతి తర్వాత జన్మభూమి-2
AP: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సంక్రాంతి తర్వాత జన్మభూమి-2 కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మరింత సమర్థవంతంగా పథకాల అమలు, అభివృద్ధి పనులపై ఫోకస్ చేయనున్నారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు, ప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని అనుసంధానం చేశారు.
News December 23, 2024
IPO బూమ్: 90 సంస్థలు.. రూ.1.60 లక్షల కోట్లు
ఈ ఏడాది కంపెనీల ఐపీవోలకు అసాధారణ రెస్పాన్స్ వచ్చింది. మొత్తం 90 సంస్థలు ఐపీవోల ద్వారా రికార్డు స్థాయిలో రూ.1.60 లక్షల కోట్ల నిధులను సేకరించాయి. దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ అత్యధికంగా రూ.27,870 కోట్లు, స్విగ్గీ రూ.11,327 కోట్లు, ఎన్టీపీసీ రూ.10వేల కోట్లను సమీకరించాయి. వచ్చే ఏడాది 75 సంస్థలు రూ.2.50 లక్షల కోట్ల సేకరణకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాయి.