News March 26, 2024

ఆరు మ్యాచుల్లో హోమ్ టీమ్‌లదే హవా

image

ఐపీఎల్ 2024లో హోమ్ టీమ్‌లదే హవా నడుస్తోంది. ఆయా జట్లు సొంత వేదికల్లో విజయాలను నమోదు చేశాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 6 మ్యాచులు జరగగా వీటిలో ఆతిథ్య జట్లే గెలుపొందడం గమనార్హం. మరి ఇవాళ చెపాక్ వేదికగా చెన్నై, గుజరాత్ మ్యాచులో ఈ జోరుకు బ్రేక్ పడుతుందేమో వేచి చూడాలి.

Similar News

News January 5, 2026

TTDలో AI వినియోగం.. కోర్టుకు స్టాండింగ్ కౌన్సిల్ నివేదిక

image

పరకామణి చోరీ కేసులో మరో FIR నమోదు అంశంపై సుప్రీం కోర్టు ఉత్తర్వులు పరిశీలించాలని CID, ACBలకు హై కోర్టు సూచించింది. గత విచారణలో TTDలో AI వాడుకలోకి తీసుకురావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన హైకోర్టు దానిపై అధ్యయనం చేసి, సలహాలు, సూచనలు ఇవ్వాలని TTDని కోరింది. దీనిపై TTD స్టాండింగ్ కౌన్సిల్ హైకోర్టుకు నివేదిక అందజేయగా పరిశీలిస్తామన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.

News January 5, 2026

సీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు తీర్పిచ్చారు: అచ్చెన్న

image

AP: నదీజలాల అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. రాష్ట్రాల మధ్య సంబంధాలు వేరు.. హక్కులు వేరని వ్యాఖ్యానించారు. హక్కుల విషయంలో ఏమాత్రం తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. 2020లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిందని ఆరోపించారు. రాయలసీమ ద్రోహి ఎవరో తెలిసే ప్రజలు కూటమికి పట్టం కట్టారన్నారు.

News January 5, 2026

J&K మొత్తం ఇండియాలోనే ఉండాలి: బాబ్ బ్లాక్‌మన్

image

POK సహా J&K అంతా ఇండియాలోనే ఉండాలని బ్రిటన్ MP బాబ్ బ్లాక్‌మన్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో భారత్‌కు అంతర్జాతీయ సమాజం మద్దతు ఇవ్వాలని జైపూర్లోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌ సభలో పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370ని తొలగించాలని 1992లోనే చెప్పానన్నారు. కశ్మీరీ పండితులను అక్కడి నుంచి వెళ్లగొట్టడాన్ని వ్యతిరేకించానని గుర్తుచేశారు. మతం పేరిట ప్రజలను వెళ్లగొట్టడం అన్యాయమని ప్రపంచానికి తెలిపానన్నారు.