News March 19, 2024

వేసవిలో.. చల్లని విహారం

image

వేసవిలో చాలా మంది విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. సూర్యుడి భగభగల నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని ప్రదేశాలకు వెళ్తారు. ఇండియాలో సమ్మర్ వెకేషన్ ప్రాంతాలు చాలానే ఉన్నా.. ఊటీ, కొడైకెనాల్, గ్యాంగ్‌టక్, కశ్మీర్, చిరపుంజి, సిమ్లా పర్యాటక ప్రదేశాలు చాలా ఫేమస్. అక్కడి ఉష్ణోగ్రతలు 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. ఆయా ప్రదేశాల్లోని ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి అందాలు మంత్రముగ్ధులను చేస్తాయి.

Similar News

News January 7, 2025

ప్రపంచాన్ని వణికించిన వైరస్‌లు ఇవే!

image

కరోనాను మరవకముందే hMP వైరస్ భారత్‌ను తాకి కలవరపెడుతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే, కరోనాకు ముందే వివిధ కాలాల్లో ప్రపంచాన్ని కొన్ని వైరస్‌లు వణికించగా, కొన్ని ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి.
1. రోటా వైరస్, 2. స్మాల్ పాక్స్, 3. మీజిల్స్(తట్టు), 4. డెంగ్యూ, 5. ఎల్లో ఫీవర్, 6. ఫ్లూ, 7. రేబిస్, 8.హెపటైటిస్-బీ&సీ, 9. ఎబోలా, 10. హెచ్‌ఐవీ.

News January 7, 2025

ఈ కోడి గుడ్డు ధర రూ.700

image

AP: సాధారణంగా బ్రాయిలర్ కోడి గుడ్డు ధర రూ.6-8, నాటు కోడి గుడ్డు అయితే రూ.10-13 పలుకుతుంది. అయితే పందెం కోడి గుడ్డుకు రూ.400-700 వరకు డిమాండ్ ఉంటోంది. తూర్పు కోడి, ఎర్ర కక్కెర, తెల్ల కోడి గుడ్డు రూ.400 వరకు, తెల్ల కెక్కర, ఎర్రమైల, అబ్రాసు మైల జాతుల గుడ్డు రూ.700 వరకు పలుకుతోంది. ఈ గుడ్లను ప్రత్యేక నాటుకోళ్లతో పొదిగిస్తారు. కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లో చాలా మందికి ఇదొక కుటీర పరిశ్రమగా మారింది.

News January 7, 2025

కాంగ్రెస్ మోసంపై నిరసనలు ఢిల్లీకి చేరాయి: కేటీఆర్

image

TG: కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకోవడంపై ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసు వద్ద పోస్టర్లు వెలిశాయని తెలిపారు. ‘రైతు డిక్లరేషన్’ ఎలా అమలవుతుందో రాష్ట్రానికి వచ్చి వివరించవచ్చు కదా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ‘అబద్ధాల కాంగ్రెస్‌లో అన్ని అరకొర గ్యారంటీలు, అర్ధ సత్యాలే’ అని ట్వీట్ చేశారు.