News February 24, 2025

SVSCలో పెద్దోడు, చిన్నోడు పేర్లివే!

image

టాలీవుడ్‌ బెస్ట్ క్లాసిక్‌లలో ఒకటైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా మరోసారి థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటించిన వెంకటేశ్, మహేశ్‌బాబుల క్యారెక్టర్ల పేర్లు రివీల్ అయినట్లు తెలుస్తోంది. పెద్దోడు, చిన్నోడు క్యారెక్టర్లకు పెట్టిన పేర్లివే. పెద్దోడు సిరి మల్లికార్జునరావు, చిన్నోడు సీతారామ రాజు అని IMDలో పేర్కొన్నారు. దీనిని ఇరు హీరోల ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.

Similar News

News October 24, 2025

కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారా?

image

కళ్లజోడు ముఖానికి సరిపోదనో, కళ్ల రంగు మారిస్తే ఫ్యాషన్ అనో చాలామంది అమ్మాయిలు కాంటాక్ట్ లెన్స్ వాడుతుంటారు. అయితే వీటి వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. వీటిని సరిగా శుభ్రం చేయకపోయినా, వాడటంలో అజాగ్రత్తగా ఉన్నా కళ్లు పొడిబారటం, కార్నియా దెబ్బతినడం, కంటి ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు ఎదురవుతాయంటున్నారు. కాబట్టి స్టైల్‌తో పాటు ఆరోగ్యాన్నీ పట్టించుకోవాలని సూచిస్తున్నారు.

News October 24, 2025

ఇవాళ భారత్ బంద్

image

కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్‌ కగార్‌’ను వ్యతిరేకిస్తూ ఇవాళ మావోయిస్టు పార్టీ దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది. అయితే దీనికి ప్రతిపక్ష పార్టీలు బహిరంగంగా ఎలాంటి మద్దతు ప్రకటించలేదు. దీంతో ఇవాళ బంద్ వాతావరణం కొనసాగే అవకాశం కనిపించట్లేదు. స్కూళ్లు, కాలేజీలు యథాతథంగా నడవనున్నాయి. అటు షాపులు కూడా తెరిచే ఉండనున్నాయి.

News October 24, 2025

నేడు..

image

* ‘రోజ్‌గార్ మేళా’లో భాగంగా 51వేల మందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ
* దుబాయ్‌లో చంద్రబాబు మూడో రోజు పర్యటన.. సాయంత్రం 6.30 గంటలకు తెలుగు డయాస్పోరా సమావేశం
* జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల విత్‌డ్రాకు ఈ రోజు మాత్రమే ఛాన్స్.. 81 మంది నామినేషన్లకు అధికారులు ఆమోదం
* WWCలో తలపడనున్న పాకిస్థాన్, శ్రీలంక