News November 22, 2024
ఆ విషయంలో కూటమి పార్టీల నేతలు గప్‌చుప్
సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల లంచాల వ్యవహారంలో అదానీపై అమెరికా దర్యాప్తు సంస్థల ఆరోపణలపై APలో టీడీపీ, జనసేన, BJP కూటమి మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అదానీ నుంచి జగన్ రూ.1,750 కోట్ల లంచాలు తీసుకున్నట్టు కూటమి అనుకూల వేదికలు ఈ వ్యవహారంపై పెద్దఎత్తున ప్రచారం చేశాయి. మోదీ-అదానీల మధ్య ఉన్న బంధం వల్లే కూటమిలోని పార్టీల నేతలు ఈ వ్యవహారంలో నేరుగా స్పందించడం లేదనే చర్చ జరుగుతోంది.
Similar News
News November 22, 2024
మమ్మల్ని రెచ్చగొట్టకండి: రష్యా హెచ్చరిక
ఉక్రెయిన్‌కు సాయం చేయడం మానుకోవాలని పశ్చిమ దేశాలకు రష్యా తాజాగా సూచించింది. తమను రెచ్చగొట్టొద్దని పేర్కొంది. ‘మా గడ్డపై జరిగే దాడుల్లో పశ్చిమ దేశాలు జోక్యం చేసుకోవద్దు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయొద్దు. మీ వైఖరి ఇలాగే కొనసాగితే ఉక్రెయిన్‌పై మరిన్ని క్షిపణి దాడులు చేస్తాం’ అని హెచ్చరించింది. ఉక్రెయిన్‌లో జనావాసాల మీదకు రష్యా బాలిస్టిక్ క్షిపణి దాడి చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
News November 22, 2024
బియ్యంలో పురుగులు.. ఇలా చేస్తే దరిచేరవు!
ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు ఆందోళనకరం. ఈ నేపథ్యంలో బియ్యంలో పురుగులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చిట్కాలను పలువురు సూచిస్తున్నారు. బియ్యం నిల్వ ఉంచే డబ్బాల్లో ఘాటైన వాసన ఉండేవాటిని వేయాలని చెబుతున్నారు. వేపాకు, బిరియానీ ఆకు, లవంగాలు, ఇంగువ, కర్పూరం, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, రాతి ఉప్పు పొట్లాలను వాటిలో ఉంచాలని చెబుతున్నారు.
News November 22, 2024
ఛాంపియన్స్ ట్రోఫీపై 26న ICC అత్యవసర సమావేశం
వచ్చే ఏడాది పాక్‌లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో అనిశ్చితి నెలకొనడంతో ఐసీసీ ఈ నెల 26న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. బీసీసీఐ, పీసీబీ పెద్దలు ఇందులో పాల్గొంటారు. భద్రతాకారణాల రీత్యా పాక్‌కు క్రికెటర్లను పంపేదే లేదని భారత్ చెబుతుండగా, పంపాల్సిందేనని పాక్ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ రెండింటి మధ్య సయోధ్యకు యత్నిస్తోంది.