News October 10, 2024
ఆ విషయంలో తగ్గేదేలే: డొనాల్డ్ ట్రంప్

మహిళా ఓటర్లలో వ్యతిరేకత వచ్చినా కమలా హారిస్‌ను ఎదుర్కోవడంలో వెనక్కు తగ్గబోనని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. పెన్సిల్వేనియా సభలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను మృదువుగా ఉండకపోతే మహిళలకు నచ్చనని అంటున్నారు. నేను దీన్ని పట్టించుకోను. అయినా మహిళలకు జాతిహితం మీదే దృష్టి ఉంటుంది. నా వ్యాఖ్యలను పట్టించుకోరు. కమల అసమర్థురాలు. అధ్యక్ష బాధ్యతలకు అనర్హురాలు’ అని పేర్కొన్నారు.
Similar News
News January 20, 2026
600 పోస్టులు.. అప్లై చేశారా?

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 600 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత గలవారు JAN 25 వరకు NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవాలి. వయసు 20 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.12,300 చెల్లిస్తారు. వెబ్‌సైట్: bankofmaharashtra.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News January 20, 2026
గ్రీన్‌లాండ్‌కు US యుద్ధ విమానం.. బలగాలను పెంచిన డెన్మార్క్

గ్రీన్‌లాండ్‌లోని పిటుఫిక్ స్పేస్ బేస్‌కు అమెరికా తన యుద్ధ విమానాన్ని పంపింది. నార్త్ అమెరికా రక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు NORAD తెలిపింది. మరోవైపు డెన్మార్క్ కూడా గ్రీన్‌లాండ్‌కు అదనపు సైన్యాన్ని, మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ను తరలించింది. గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవాలని ట్రంప్ చూస్తున్న తరుణంలో ఇరు దేశాలు తమ మిలిటరీ పవర్‌ను పెంచడం ఉత్కంఠ రేపుతోంది.
News January 20, 2026
HURLలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

హిందుస్థాన్ ఉర్వరిక్& రసాయన్ లిమిటెడ్ (<


