News April 8, 2024

రాష్ట్రంలో రూ. 71 కోట్ల నగదు, వస్తువుల పట్టివేత

image

TG: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఇప్పటి వరకు రూ. 71కోట్లకు పైగా డబ్బు, విలువైన ఇతర వస్తువుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ.29.30 కోట్ల నగదు, రూ.9.54 కోట్ల మద్యం, రూ.15.34 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.10.33 కోట్ల విలువైన అభరణాలు, రూ.7.04 కోట్ల విలువైన ఇతర వస్తువులు ఉన్నట్లు వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

Similar News

News January 9, 2026

పెరిగిన బంగారం ధరలు, తగ్గిన వెండి రేటు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు పెరగగా, వెండి రేట్లు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరిగి రూ.1,38,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 పెరిగి రూ.1,27,150 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర రూ.4వేలు తగ్గి రూ.2,68,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప మార్పులున్నాయి.

News January 9, 2026

16 ఏళ్లు నిండితేనే గిగ్ వర్కర్‌గా నమోదు

image

గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లుగా నమోదవడానికి 16 ఏళ్లు నిండినవారే అర్హులని కేంద్ర కార్మికశాఖ ఇటీవల వెల్లడించింది. ఆధార్, ఇతర డాక్యుమెంట్ల ద్వారా ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంది. రిజిస్టరయిన ప్రతి కార్మికుడికి ప్రత్యేక UAN వస్తుంది. తర్వాత ఫొటో, ఇతర వివరాలతో డిజిటల్ కార్డు జారీ అవుతుంది. వీరు సామాజిక భద్రత పథకాలకు అర్హులు అవుతారు. కార్మికులు ఏడాదిలో కనీసం 90 రోజులు <<18740165>>పనిచేయాల్సి<<>> ఉంటుంది.

News January 9, 2026

నాణ్యత లేదని కొన్న పంటను తిరిగి పంపేశారు

image

TG: సోయాపంట విక్రయించిన రైతులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రైతులు అమ్మిన సోయా గింజల్లో నాణ్యత లేదంటూ వేలాది క్వింటాళ్ల సోయా బస్తాలను వెనక్కి తిరిగి పంపుతున్నారు. ఆ బస్తాలను తిరిగి తీసుకెళ్లాలని రైతులకు ఫోన్ చేసి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చెప్తున్నారు. దీంతో ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి సహా ఇతర జిల్లాల్లో సోయా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.