News March 18, 2024
ఉండిలో ‘రాజు’లదే విజయం..ఈ సారి గెలుపెవరిదో..?

1952లో నియోజకవర్గంగా ఏర్పడిన ఉండి TDPకి కంచుకోట. ఇప్పటివరకు 16సార్లు ఎన్నికలు జరగగా 8సార్లు పాగా వేసింది. అందులో 1983-1999 వరకు TDP అభ్యర్థి K.రామరాజు వరుసగా 5సార్లు విజయం సాధించారు. అయితే ఇక్కడ గెలిచిన MLAలలో 8మంది పేర్లు ‘రాజు’లే కావడం గమనార్హం. 1970లో జరిగిన ఒక్కఎన్నికలోనే మహిళ అభ్యర్థి K.ఆండాళమ్మ ఇండిపెండెంట్గా గెలిచారు. ఈ సారి TDP నుంచి మంతెన రామరాజు, YCP నుంచి PVL నరసింహరాజు బరిలో ఉన్నారు.
Similar News
News November 22, 2025
ప.గో: మాక్ అసెంబ్లీలో ‘రియల్’ పాలిటిక్స్?

మాక్ అసెంబ్లీకి విద్యార్థుల ఎంపిక ప్రక్రియలో పశ్చిమ గోదావరి జిల్లాలో గందరగోళం నెలకొంది. క్విజ్లో ప్రతిభ చూపిన తాడేరుకు చెందిన ఉమా లిఖిత ఎంపికైనట్లు విద్యా శాఖ ప్రకటించిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. చివరి నిమిషంలో జాబితా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ మార్కులు వచ్చిన రాయకుదుర్రు విద్యార్థిని ఎంపిక చేయడం వెనుక రాజకీయ జోక్యం ఉందని ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
News November 22, 2025
ప.గో: హెలికాప్టర్ దిగగానే.. పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ ఇదిగో!

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 24న ద్వారకాతిరుమల మండలంలో పర్యటిస్తారు. కొయ్యలగూడెం (M) రాజవరంలో హెలిప్యాడ్లో దిగి అక్కడ నుంచి ద్వారకాతిరుమల మండలం జగన్నాథపురం చేరుకుంటారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేస్తారు. ముందుగా ఆయన స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఏర్పాట్లను కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు.
News November 22, 2025
ప.గో: జాతీయ స్థాయి యోగా పోటీలకు ఇరువురి ఎంపిక

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు బడుగు చంద్రశేఖర్ (మోదుగ గుంట), హెచ్. రమాదేవి (చెరుకువాడ) ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో గోవాలో జరగనున్న యోగా పోటీల్లో పాల్గోనున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు బడుగు చంద్రశేఖర్ శుక్రవారం రాత్రి తెలిపారు.


