News March 28, 2024
ఉత్తరాంధ్రలో ఈ సీట్లపై వీడని పీటముడి

AP: చీపురుపల్లి, భీమిలి TDP MLA అభ్యర్థుల ఎంపిక పీటముడిగా మారింది. మాజీ మంత్రి గంటా చీపురుపల్లిలో పోటీ చేస్తే భీమిలిలో కళా వెంకట్రావు, నెల్లిమర్ల TDP ఇన్‌ఛార్జ్ బంగార్రాజు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గంటా చీపురుపల్లిలో పోటీ చేయకుంటే అక్కడ కళా వెంకట్రావు, కిమిడి నాగార్జునలో ఒకరికి అవకాశం దక్కొచ్చు. విజయనగరం MP స్థానానికీ వెంకట్రావు, నాగార్జున, బంగార్రాజు, గీత పేర్లు వినిపిస్తున్నాయి.
Similar News
News April 2, 2026
కిడ్నీ ముఠా గుట్టురట్టు.. మూవీ తీయొచ్చేమో!

UP కాన్పూర్‌లో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ ఉదంతం సినిమా స్టోరీని తలపిస్తోంది. ఓ యువకుడు తన కిడ్నీని రూ.10లక్షలకు అమ్మేందుకు ముఠాతో ఒప్పందం చేసుకున్నాడు. అయితే ఆపరేషన్ పూర్తయ్యాక అతనికి రూ.9.5లక్షలే ఇవ్వడంతో మిగిలిన డబ్బు కోసం గొడవ జరిగింది. ఆ కోపంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విచారణలో అంతర్జాతీయ ముఠా గుట్టురట్టైంది. వీరు రూ.10లక్షలకు కొని రోగికి రూ.60లక్షలకు అమ్ముతున్నట్లు విచారణలో తేలింది.
News April 2, 2026
గుడ్ న్యూస్: రూ.7,358 కోట్లు దశలవారీ చెల్లింపు

AP: ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.7,358 CR బకాయిల విడుదలకు GOVT చర్యలు చేపట్టింది. CM ఆదేశాలతో చెల్లింపు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. గ్రాట్యుటీ ₹3,411CR, లీవ్ ఎన్‌క్యాష్మెంటు ₹1800CR ఇవ్వాల్సి ఉండగా నిధుల అందుబాటును అనుసరించి విడుదల చేస్తున్నామంది. ఇప్పటికే PF కింద ₹1,848CR, GLI కింద ₹76CR, పోలీసుల సరెండర్ లీవులకు ₹223CR జమ చేశామని ఫైనాన్స్ విభాగం తెలిపింది.
News April 2, 2026
‘అతలాకుతలం’ వెనుక ఇంత ఉందా?

విపత్తుల కారణంగా భారీ నష్టం సంభవించినప్పుడు, వ్యాపారాలు దెబ్బతిన్నప్పుడు ‘అతలాకుతలం’ అనే జాతీయం వాడతాం. పురాణాల ప్రకారం భూమి కింద ఏడు లోకాలు(అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం) ఉన్నాయి. ఇందులో సుతలానికి బదులు కుతలమనే శబ్దాన్ని వాడుతున్నారు. ఆ లోకాలు తారుమారయితే పరిస్థితులు దెబ్బతిన్నట్లే. నిజ జీవితంలోనూ పరిస్థితులు తలకిందులయ్యాయని చెప్పేందుకూ దీన్ని వాడుతున్నాం.
<<-se>>#EPICSAYINGS<<>>


