News September 28, 2024
విడాకులివ్వకుండా ఇంకొకరితో ఉండమని ఏ ధర్మంలో ఉంది?: సీదిరి

AP: సనాతన ధర్మం పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డ్రామాలు చేస్తున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. ‘భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఇంకొకరితో కలిసి ఉండమని ఏ ధర్మంలో ఉంది? చేగువేరా ఆదర్శాలు ఎటు వెళ్లిపోయాయి? బాప్టిజం తీసుకున్నానని ఆయన చెప్పారు. అలాగే తన భార్య క్రిస్టియన్, పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అని తెలిపారు. ఇవన్నీ ఏ సనాతన ధర్మంలో ఉన్నాయో చెప్పాలి?’ అని ప్రశ్నించారు.
Similar News
News November 27, 2025
రుద్రవరంలో యాక్సిడెంట్.. 150 బస్తాల ధాన్యం నేలపాలు

రుద్రవరం మండల పరిధిలోని గుట్టకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో వరి ధాన్యం లోడుతో వెళుతున్న డీసీఎం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. గుట్టకొండ ప్రాంతం నుంచి సుమారు 150 బస్తాలు వరి ధాన్యం లోడుతో లారీ నంద్యాలకు బయలుదేరింది. మార్గమధ్యంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం దాటిన తర్వాత వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్కు గాయాలయ్యాయి.
News November 27, 2025
అమరావతిలో వేంకటేశ్వర ఆలయ విస్తరణ.. నేడు సీఎం భూమిపూజ

AP: అమరావతి కృష్ణానది తీరంలో శ్రీవేంకటేశ్వర ఆలయ విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం 2 దశల్లో ₹260Cr వెచ్చించనుంది. ఈ పనులకు CM CBN ఇవాళ భూమి పూజ చేయనున్నారు. దాదాపు 3వేల మంది భక్తులు పాల్గొని వీక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాకారం, ఏడంతస్తుల రాజగోపురం, సేవా మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం, పుష్కరిణి, విశ్రాంతి భవనం తదితర పనులు పూర్తిచేస్తారు.
News November 27, 2025
వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.


