News October 7, 2025
కంచం కడిగిన నీటిని ఏ దిక్కున పారబోయాలి?

పళ్లెం కడిగిన నీటిని పారబోసే దిక్కులు మన వృద్ధిని ప్రభావితం చేస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ నీటిని తూర్పు, పశ్చిమం, ఉత్తరం, ఈశాన్యం దిక్కుల వైపు చల్లడం శుభప్రదం అని అంటున్నారు. ఉత్తరం, ఈశాన్యం వైపు చల్లితే లక్ష్మీ కటాక్షం, ధనవృద్ధి, సౌభాగ్యం కలుగుతాయని సూచిస్తున్నారు. ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, వాయవ్యం వంటి దిక్కుల్లో పారబోస్తే ఇంట్లో సంకటాలు, రోగభయాలు, శత్రుత్వం వంటివి కలుగుతాయని అంటున్నారు.
Similar News
News October 7, 2025
గుడులపై ఉన్న శ్రద్ధ బడులపై లేదెందుకు: షర్మిల

AP: విశాఖ KGHలో చికిత్స పొందుతున్న <<17923468>>గురుకులాల<<>> పిల్లలను చూస్తే కడుపు తరుక్కుపోతుందని APCC చీఫ్ షర్మిల పేర్కొన్నారు. వారి శరీరాలు చూస్తే ఏం ఆహారం పెడుతున్నారో కానీ సోమాలియా దేశ పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి గుడులపై ఉన్న శ్రద్ధ బడులపై లేదని దుయ్యబట్టారు. ముగ్గురు గిరిజన బిడ్డల ప్రాణాలు పోయినందుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
News October 7, 2025
అత్యవసరమైతే ఇంటర్నెట్ డేటా పొందొచ్చు!

ఒక్కోసారి బ్యాలెన్స్ అయిపోయి యూజర్లు ఇబ్బందిపడుతుంటారు. అయితే డేటా బ్యాలెన్స్ అయిపోయినప్పుడు అత్యవసరమైతే 1GB డేటా(₹11) పొందే అవకాశాన్ని ఆపరేటర్లు అందిస్తున్నాయి. MyJio యాప్‌లో ఎమర్జెన్సీ డేటా లోన్ ఆప్షన్ ద్వారా 1GB డేటా పొందొచ్చు. *567*3#/ *141*567#కు డయల్ చేసి 500MB లేదా 1GB డేటా పొందొచ్చు. అలాగే Vi నంబర్ నుంచి 121249 డయల్ చేసి డేటా లోన్ పొందొచ్చు. *ఇవి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. SHARE IT
News October 7, 2025
జగన్ రోడ్ షోకు అనుమతి నిరాకరణ

AP: ఎల్లుండి అనకాపల్లి జిల్లాలో మాజీ CM జగన్ రోడ్ షోకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. విశాఖ నుంచి మాకవరపాలెం మెడికల్ కాలేజీకి రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేమని SP తుహీన్ సిన్హా తెలిపారు. ‘ఈ 2 ప్రాంతాల మధ్య దూరం 63km. TNలోని కరూర్ ఘటన నేపథ్యంలో పర్మిషన్ ఇవ్వలేదు. హెలికాప్టర్‌లో వెళ్తామంటే పరిశీలిస్తాం’ అని అన్నారు. కాగా అనుమతి ఇవ్వకపోయినా జగన్ రోడ్‌షో ఉంటుందని మాజీ మంత్రి గుడివాడ తెలిపారు.