News April 5, 2025
INC, BRS దూరం.. రసవత్తరంగా MLC ఎన్నిక

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్ణయించాయి. దీంతో బీజేపీ, ఎంఐఎం మధ్యే పోటీ రసవత్తరంగా జరగనుంది. ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ నుంచి గౌతమ్‌రావు బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతర్గతంగా ఎవరికి మద్దతు ఇస్తాయనేదానిపైనా ఆసక్తి నెలకొంది. కాగా ఈనెల 23న పోలింగ్ జరగనుండగా 112 మంది ఓటు వేయనున్నారు.
Similar News
News April 5, 2025
ప్రేమ పేరుతో మోసం.. 4 పెళ్లిళ్లు చేసుకున్న యువతి

ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతి నలుగురిని మోసగించింది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని మండ్య జిల్లాలో వైష్ణవి, శశికాంత్ 8 నెలలగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందే అతని వద్ద ఆమె రూ.7లక్షలు, 100గ్రా బంగారం కాజేసింది. మార్చి 24న పెళ్లి జరగ్గా, మరుసటి రోజే వాటితో పరారైంది. శశికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గతంలోనూ ఆ యువతి ఇలాగే 3పెళ్లిళ్లు చేసుకొని ముగ్గురిని మోసగించిందని తెలిసింది.
News April 5, 2025
సమసమాజ స్థాపన కోసం తపించిన బాబూజీ

బాబు జగ్జీవన్ రాం బిహార్‌లోని చంద్వాలో 1908లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే కుల వివక్షపై పోరాడారు. స్వాతంత్ర్య ఉద్యమంలో, స్వాతంత్య్రం వచ్చాక ఆధునిక భారత దేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారు. కేంద్రంలో 30 ఏళ్లపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించారు. ఉపప్రధానిగా పని చేశారు. బాబూజీగా ప్రసిద్ధి చెందిన ఆయన దళితుల అభ్యున్నతికి, సామాజిక సమానత్వం కోసం పోరాడారు. నేడు జగ్జీవన్ రాం 117వ జయంతి.
News April 5, 2025
వీకెండ్లో ఇలాంటి పనులు చేస్తున్నారా?

వీకెండ్ రాగానే చాలామంది రెస్టారెంట్లు, మద్యం, సినిమాలు అంటూ గడిపేస్తారు. కానీ వారాంతాల్లో తగినంత సమయం కుటుంబం, ఫ్రెండ్స్, సన్నిహితులతో సరదాగా గడపాలని నిపుణులు చెబుతున్నారు. మీకు నచ్చిన పుస్తకాలు చదవాలి. ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్ ఆడాలి. భాగస్వామికి ఇంటి పనిలో సహాయం చేయాలి. ఇంట్లో పిల్లలుంటే సరదాగా గడపాలి. హాయిగా పడుకుని నిద్రపోవచ్చు. ఇలా చేస్తే ఫ్రెష్‌గా సోమవారం ఆఫీస్‌కు వెళ్లి వర్క్ చేసుకోవచ్చు.