News October 27, 2024
6 నెలల్లో INC ప్రభుత్వం కూలిపోయేలా ఉంది: ఎర్రబెల్లి

TG: త్వరలోనే రాష్ట్రంలో బాంబు పేలుతుందని, గత ప్రభుత్వ ముఖ్యులంతా లోపలికి వెళతారని మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై ఎర్రబెల్లి దయాకర్రావు సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేతలే పరస్పరం బాంబులు వేసుకుంటున్నారని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి వేసే బాంబులు చాలవా అని ఎద్దేవా చేశారు. వీరి వ్యాఖ్యలు చూస్తుంటే 6 నెలల్లోనే ప్రభుత్వం పడిపోయేలా ఉందన్నారు.
Similar News
News November 22, 2025
మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య అప్డేట్

నటసింహం నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై మరోసారి స్పష్టతనిచ్చారు. గోవాలో జరిగిన IFFI వేడుకల్లో మాట్లాడుతూ ‘ఆదిత్య 369’ సీక్వెల్ ‘ఆదిత్య 999 మ్యాక్స్’లో మోక్షజ్ఞ తనతో కలిసి నటించనున్నట్లు ధ్రువీకరించారు. ఈ ప్రకటనతో నందమూరి అభిమానుల్లో జోష్ నెలకొంది. గతంలో మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో డెబ్యూ చేస్తాడని అనుకున్నా ఆ ప్రాజెక్టు గురించి ఎటువంటి అప్డేట్స్ లేవు.
News November 22, 2025
పార్లమెంటులో ‘అమరావతి’ బిల్లు: పెమ్మసాని

AP: రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించే గెజిట్ ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. CRDA కార్యాలయంలో మాట్లాడుతూ ‘రాజధాని రైతులకు 98% ప్లాట్ల పంపిణీ పూర్తయింది. మిగిలిన సమస్యలనూ త్వరలో పరిష్కరిస్తాం. రాబోయే 15ఏళ్లలో జనాభా పెరుగుదల అంచనాల ప్రకారం సదుపాయాలు కల్పిస్తాం’ అని వివరించారు.
News November 22, 2025
బిట్స్ పిలానీలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని బిట్స్ పిలానీ 4 కేర్ టేకర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.bits-pilani.ac.in/


