News August 12, 2025

ఎడతెరిపిలేని వర్షం

image

TG: హైదరాబాద్‌లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. మరో 2 గంటల పాటు వర్షం కొనసాగే ఆస్కారం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. అటు నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, జనగామ, యాదాద్రి జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. మీ ఏరియాలో వెదర్ ఎలా ఉంది.

Similar News

News August 12, 2025

ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూత

image

TG: వరంగల్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి అనిశెట్టి రజిత(67) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం ఓ పుస్తకావిష్కరణలో యాక్టివ్‌గా కనిపించిన ఆమె అకస్మాత్తుగా మరణించడం సాహితీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సామాజిక అంశాలపై ఆమె రాసిన పుస్తకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. TG తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించాయి. 500 కవితలు, 100 వ్యాసాలు, 30కి పైగా పాటలు రాశారు.

News August 12, 2025

అందుబాటులోకి రాని టికెట్లు.. ఏ సినిమా కోసం వెయిటింగ్?

image

ఎన్టీఆర్, హృతిక్ నటించిన ‘వార్-2’, రజినీకాంత్ నటించిన ‘కూలీ’ రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్నాయి. అయినా ఈ సినిమాలకు సంబంధించి టికెట్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. టికెట్ల ధరలు పెంపు, తొలి రోజు షో టైమింగ్స్‌పై స్పష్టత రాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. దీనిపై ఇవాళ సాయంత్రం కల్లా క్లారిటీ వచ్చే అవకాశముందని సమాచారం. మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?

News August 12, 2025

డీఎస్సీ ఫలితాలు.. అభ్యర్థులకు అలర్ట్

image

AP: మెగా DSC <<17374210>>ఫలితాలు<<>> నిన్న రాత్రి విడుదలయ్యాయి. DSC నార్మలైజేషన్, టెట్ వెయిటేజీ మార్కులు కలిపి విద్యాశాఖ ఫలితాలను ప్రకటించింది. టెట్ మార్కులపై అభ్యంతరాలుంటే అప్డేట్ చేసుకునేందుకు ఇవాళ, రేపు అవకాశం కల్పించింది. అభ్యంతరాల పరిశీలన తర్వాత సవరించిన తుది మార్కులను రిలీజ్ చేయనుంది. అనంతరం జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి పోస్టులు, రిజర్వేషన్ల ప్రకారం ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెల్లడించే ఛాన్స్ ఉంది.