News October 20, 2024

గ్రూప్-1 అభ్యర్థులను రెచ్చగొడుతున్నారు: మహేశ్

image

TG: గ్రూప్-1 అభ్యర్థులను విపక్షాలే తప్పుదోవ పట్టించి, రెచ్చగొడుతున్నాయని TPCC చీఫ్ మహేశ్ కుమార్ మండిపడ్డారు. GO 29తో రిజర్వేషన్ అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగట్లేదని, ఎంతోమంది నిపుణులతో చర్చించే ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మెరిట్ ర్యాంక్ వచ్చిన రిజర్వ్‌డ్ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలోనే ఉంటారన్నారు. మెయిన్స్ రాస్తున్న వారిలో 70% మంది రిజర్వేషన్ అభ్యర్థులేనని మహేశ్ తెలిపారు.

Similar News

News January 29, 2026

లిక్కర్ కేసులో ముగ్గురికి బెయిల్

image

ఏపీ లిక్కర్ కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడుకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బెయిలిచ్చింది. రాజ్ కసిరెడ్డి, ముప్పిడి అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్లను కొట్టేసింది.

News January 29, 2026

‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా FTA: ప్రధాని మోదీ

image

భారత్, EU వాణిజ్య ఒప్పందం దేశ భవిష్యత్‌కు కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌గా ఈ ఒప్పందం మారిందన్నారు. ఈ FTA యువతకు, ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తుందని చెప్పారు. మన వస్తువులకు అతిపెద్ద మార్కెట్ దక్కిందని, బ్రాండ్‌కు గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. తయారీ, సర్వీస్ సెక్టార్లలోనూ దేశ భాగస్వామ్యం పెరుగుతుందన్నారు. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ నినాదంతో ముందుకెళ్తామని చెప్పారు.

News January 29, 2026

నవగ్రహాలు – ప్రీతికరమైన వస్త్రధారణ

image

ఆదిత్యుడు – ఎరుపు వస్త్రం
చంద్రుడు – తెలుపు వస్త్రం
అంగారకుడు – ఎరుపు వస్త్రం
బుధుడు – పచ్చని వస్త్రం
గురు – బంగారు రంగు వస్త్రం
శుక్రుడు – తెలుపు వస్త్రం
శని – నలుపు వస్త్రం
రాహువు – నలుపు వస్త్రం
కేతువు – రంగురంగుల వస్త్రం