News December 4, 2024

వారిని ఎస్సీల్లో చేర్చండి.. కేంద్రానికి ఎంపీ బైరెడ్డి శబరి లేఖ

image

AP: రాష్ట్రంలోని బేడ బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌కు MP బైరెడ్డి శబరి లేఖ రాశారు. సంచార జాతులుగా పేరొందిన వీరు జానపద కథలు చెప్తూ జీవిస్తారు. దీంతో ఒక గ్రామానికి పరిమితం కాకపోగా ఇప్పటికీ దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. వీరిని SCల్లో చేర్చడంలో కేంద్రం చొరవ చూపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News March 13, 2026

నిర్మల్‌లో ఈ నెల 16న జాబ్ మేళా

image

నిర్మల్ పట్టణంలో నిరుద్యోగుల కోసం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పనా శాఖ అధికారి తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈ నెల 16న వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కల్పన కోసం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 124 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు తమ సర్టిఫికెట్లతో జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు.

News March 13, 2026

‘ఉస్తాద్ భగత్‌సింగ్’ టికెట్ ధరలు భారీగా పెంపు

image

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 10 రోజులపాటు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.125 పెంచుకునేందుకు ఓకే చెప్పింది. బెనిఫిట్ షో టికెట్ ధర రూ.500గా నిర్ణయించింది. ఈ మూవీ ఉగాది సందర్భంగా ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బెనిఫిట్ షోలు ఆ రోజు తెల్లవారుజామున 4-5 గంటల మధ్య ప్రదర్శితమవుతాయి.

News March 13, 2026

నేనూ రైతు బిడ్డనే: చంద్రబాబు

image

AP: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ జరిగిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. కేంద్రం ఇచ్చే ₹6 వేలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం ₹14 వేలు కలిపి ఏటా ప్రతి రైతు ఖాతాలో ₹20 వేలు జమ చేస్తున్నట్లు ప్రకటించారు. తాను కూడా రైతు బిడ్డనేనని.. వారి కష్టాలు తనకు తెలుసని, అందుకే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.